ఇక ఆండ్రాయిడ్ లోన సూపర్ మారియో

Super Mario Game For Android Users

09:58 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Super Mario Game For Android Users

సూపర్ మారియో.. మోస్ట్ పాపులర్ వీడియో గేమ్‌. ఈ గేమ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. సూపర్ వరల్డ్ ఫర్ మారియో పేరిట అందుబాటులో ఉన్న ఈ గేమ్‌ తొలి వెర్షన్‌ను యూజర్లు ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీడియోగేమ్ మాదిరిగానే దీంట్లోనూ సూపర్ మారియో ఉంటాడు. వివిధ రకాల మార్గాల్లో ఎదురయ్యే అడ్డంకులను దాటుతూ, పాయింట్లను సాధిస్తూ అనేక లెవల్స్‌ను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే టీవీ కంటే బెటర్‌గా ఈ గేమ్‌లోని గ్రాఫిక్స్ కనిపించేలా తీర్చిదిద్దారు. 5 రకాల మారియో వరల్డ్‌లలో దాదాపు 120 లెవల్స్ దాకా ఉన్నాయి. రన్, జంప్, బాంబ్‌ల కోసం ప్రత్యేక బటన్లను స్క్రీన్‌పైనే అందించారు. దీన్ని గేమింగ్ ప్రియులు ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

English summary

Our Childhood game Super Mario was released a new game for Android Smartphone users.The name of this game was Super World For Mario.