మార్కెట్‌లోకి  సూపర్‌ మారియో వాచ్‌

Super Mario Watch

03:18 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Super Mario Watch

సూపర్‌ మారియో గేమ్‌ తెలియని పిల్లలంటూ ఉండరు . వీడియో గేమ్‌ శకాన్ని ఏలిన ఈ గేమ్‌కు నేటితో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1985 లో ప్రారంభమైన ఈ గేమ్‌ ప్రస్ధానం 2015 తో 30 ఏళ్ళు వచ్చాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక కొత్త వాచ్‌ను తయారు చేసారు. ప్రముఖ లగ్జరీ వాచ్‌ల తయారీ సంస్థ అయిన రోమాన్‌ జెరోమ్‌ సంస్థ సూపర్‌ మారియో వాచ్‌ పేరిట ఒక లిమిటెడ్‌ వెర్షన్ వాచ్‌ను తయారు చేసింది . ఈ వాచ్‌లో సాధారణ డైయితో పాటు సూపర్‌ మారియో బొమ్మలను కూడా పొందుపరిచారు . ఈ వాచ్‌ను బ్లాక్‌ టైటేనియమ్‌ తో తయారు చేసారు. ఈ వాచ్‌ 4 హెర్ట్జ్ తో 42 గంటల పవర్‌ రిజర్వతో పని చేస్తుంది..

సూపర్‌ మారియో ను ఇష్టపడేవాళ్ళు ఈ వాచ్‌ దక్కించుకోవాలంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే దీని ధర ఏకంగా 12,64,106 రూపాయలు ఇంత ధర పెట్టి ఈ వాచ్‌ను కొనే బదులు ఒక పెద్దకారును కొనుకోవచ్చని అంతా అనుకుంటున్నారు . ఎవరు ఏమనుకున్నా సూపర్‌ మారియోకు ఉన్న క్రేజ్‌ ముందు వాచ్‌ ధర ఎంద అని సూపర్‌ మారియో ఫ్యాన్స్‌ అంటున్నారు.

సూపర్ మారియో 30 ఏళ్ళ ప్రస్థానాన్ని ఈ కింద వీడియోలో చూడచ్చు .

English summary

Super Mario game has now completed 30 years.On this occassion the luxury watch makers Roman JErome company released a limited version Super Mario watch