న్యూడ్ ఫోటోలు పంపుతారట.. 'ట్రాంప్స్ ఎగైనెస్ట్ ట్రంప్' వినూత్న ఆఫర్

Super offer for against Trump

01:34 PM ON 1st August, 2016 By Mirchi Vilas

Super offer for against Trump

ఎన్నికలన్నాక రకరకాల ప్రచారాలు సహజం... ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టే వినూత్న ప్రచారాలు, పాజిటివ్ ఓటుకు జిమ్ముక్కులు షరా మామూలే... అయితే, అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఓటెయ్యకుంటే నగ్న ఫొటోలు పంపిస్తామంటూ 'ట్రాంప్స్ ఎగైనెస్ట్ ట్రంప్' వ్యవస్థాపకురాలు జెస్సికా రాబిట్ ఓటర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటేసినట్టు ఫొటోగ్రాఫిక్ సాక్ష్యం చూపిస్తే చాలట. వెంటనే నగ్నఫొటోలు పంపిస్తామంటూ సంచలన ప్రకటన చేసింది. ఇటువంటి ప్రచారం త్వరలో ప్రపంచవ్యాప్తంగా జోరందుకుంటుందని కూడా ఆమె జోస్యం చెప్పింది.

ట్రంప్ మద్దతుదారులు కొందరు తనతో టచ్ లో ఉన్నారని చెబుతున్న జెస్సికా ట్రాంప్స్ ఎగైనెస్ట్ ట్రంప్తో ఆయన ప్రత్యర్థులకు పండుగేనని కొందరు అంటున్నారు. నవంబర్ లో జరిగే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ , డోనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

English summary

Super offer for against Trump