ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్...

Super response for Nagarjuna first look

01:13 PM ON 30th August, 2016 By Mirchi Vilas

Super response for Nagarjuna first look

కుర్ర హీరోలతో సమానంగా దూసుకుపోతూ, టాలీవుడ్ టాప్ హీరోల్లో నాగార్జున ఇప్పుడు నంబర్ వన్ గా వున్నాడని చెప్పవచ్చు. నాగార్జున చేసిన సినిమాలు మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సూపర్ హిట్ అయ్యి సీనియర్ హీరోల్లో నాగార్జునని కింగ్ గా నిలబెట్టాయి. ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సోగ్గాడే చిన్ని నాయనా అయితే ఏకంగా 50 కోట్లు కలెక్ట్ చేసి నాగార్జున మార్కెట్ ను అమాంతం పెంచేసింది. అలా హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన నాగార్జున ప్రస్తుతం రాఘవేంద్రరావు డైరెక్ట్ చేస్తున్న 'నమో వెంకటేశాయా' చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయింది.

ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా రిలీజ్ చేసిన నాగార్జున ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ మూవీ ఇప్పటికే 30 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని టాక్. వెంకటేశ్వర స్వామి భక్తుడు హాధీరామ్ బాబా జీవితం ఆధారంగా రాఘవేంద్రరావు రూపొందుస్తున్న నమో వెంకటేశాయాలో నాగార్జునతో పాటు అనుష్క, ప్రగ్యాజైస్వాల్, విమలా రామన్ నటిస్తున్నారు. అన్నమయ్య తరువాత నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన 'శిరిడిసాయి' నిరాశపరచినా, ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్ లో జరగడానికి కింగ్ నాగార్జున మార్కెట్ పెరగడమే కారణం అని ట్రేడ్ పండితులు అంటున్నారు.

English summary

Super response for Nagarjuna first look. Nagarjuna first look was excellent in Om Namo Venkatesaya movie