ఇద్దరు విలన్స్‌తో పోటీపడనున్న సూపర్‌స్టార్‌!!

Super Star fighting with two villans in Kabali

04:30 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Super Star fighting with two villans in Kabali

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి'. రజనీ సినిమా హిట్టయ్యి చాలా రోజులు అవడంతో అభిమానులు ఈ సినిమా పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ ఇద్దరు విలన్స్‌తో తలపడనున్నారు. మలేషియాకు చెందిన నటుడు రోస్యం నోర్, చైనా స్టార్‌ విన్స్‌టన్ చావో లను ఈ సినిమాలో విలన్లుగా ఎంపిక చేసినట్లు దర్శకుడు రంజిత్‌ ప్రకటించారు. ఈ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్‌, స్పెషల్‌ విజువల్‌ ఎఫెక్ట్స్ రజనీ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతాయని అంటున్నారు.

రాధిక ఆప్టే, ధన్సిక ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. నిర్మాత ఎస్‌. థాను ఈ సినిమా భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ను మలేషియాలో చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల 28 వరకు మలేషియాలోనే ఘాటింగ్‌ జరగనుంది. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలని సినిమా యూనిట్‌ అనుకుంటున్నారు.

English summary

Super Star RajiniKanth fighting with two villans in Kabali movie. China star Winston Chao and Malaysia actor Rosyam Nor is acting as a villans in this film. Ranjith Kumar is directing this movie. Radhika Apte is acting as a heroine in this film.