ఎన్టీఆర్ కి తండ్రిగా సూపర్ స్టార్

Super Star Krishna in Janatha Garage

05:30 PM ON 11th April, 2016 By Mirchi Vilas

Super Star Krishna in Janatha Garage

'నాన్నకు ప్రేమతో' వంటి చిత్రం తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’. 'శ్రీమంతుడు' వంటి ఘన విజయాన్ని అందించిన కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే ముంబాయ్ లో నెల రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుని హైదరాబాద్ తిరుగొచ్చిన 'జనతా గ్యారేజ్' చిత్ర టీమ్ మళ్లీ గోవా లో షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి ఓ వార్త ప్రస్తుతం ఇంటెర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తుండగా.. మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్.

ఈ చిత్రంలో కృష్ణ గారు ఎన్టీఆర్‌కు తండ్రిగా నటించబోతున్నారని సమాచారం. అయితే ఎన్టీఆర్ కి తండ్రిగా మొదట సత్యరాజ్‌ను తీసుకోవాలని అనుకున్నా... సత్యరాజ్ ‘బాహుబలి 2’ కారణంగా డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్లేస్‌లో కృష్ణని తీసుకోబోతున్నారని సమాచారం. రీసెంట్‌గా కొరటాల శివ కృష్ణని సంప్రదించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయిందని యూనిట్ చెబుతున్నారు. ప్రస్తుతం కృష్ణ ‘శ్రీ శ్రీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆ షూటింగ్ అయిపోయిన వెంటనే జనతా గ్యారేజ్ సెట్‌లోకి ఆయన రావడం ఖాయమని ఇన్‌సైడ్ సమాచారం.

English summary

Super Star Krishna in Janatha Garage. Super Star Krishna is acting as a father to Young Tiger Ntr in Janatha Garage movie.