ప్రిన్స్ కి సూపర్ స్టార్ కితాబు

Super Star Krishna Praises Brahmotsavam Movie

09:51 AM ON 21st May, 2016 By Mirchi Vilas

Super Star Krishna Praises Brahmotsavam Movie

ప్రిన్స్ మహేశ్‌ బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపధ్యంలో ఈ చిత్రాన్ని చూసిన మహేశ్‌ తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన సతీమణి విజయ నిర్మల సినిమా పై తమ అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఎంతైనా పుర్త్రోత్సాహం కదా ... ‘బ్రహ్మోత్సవం సినిమాను పీవీపీ చాలా రిచ్‌గా, అందంగా తీశారు. ప్రతి ఫ్రేం ఒక బ్రహ్మోత్సవంలాగే ఉంది. ఇది ఫ్యామిలీ డ్రామా. క్రైం లేదు, విలన్స్‌ లేరు. అన్నీ మంచి క్యారెక్టర్సే. ఇంత స్టార్‌ కాస్ట్‌ ఏ సినిమాలోనూ లేదు. మహేశ్‌ ఇంతకు మునుపు సినిమాల్లో కంటే ఇందులో చాలా ఆనందంగా, అందంగా కనిపించాడు. దానికి కెమెరామన్‌కు థ్యాంక్స్‌ చెప్పాలి. దర్శకుడు ప్రతి ఫ్రేంను కన్నుల పండుగ్గా తీశారు. సినిమా చాలా బావుంది’ అని కృష్ణ అన్నారు. విజయ నిర్మల మాట్లాడుతూ... ‘బ్రహ్మోత్సవం పేరుకు తగినట్లే ఓ బ్రహ్మోత్సవం చూసినట్లు ఉంది. కళ్లకు నిండుగా ఏ ఫ్రేమ్‌ చూసినా ఆ రిచ్‌నెస్‌ కనిపిస్తోంది. మహేశ్‌ చాలా అందగాడు. చూస్తుంటే నాకే ఈర్ష్యగా ఉంది.. సినిమాలో మహేశ్‌ అంత అందంగా ఉన్నాడు. సినిమా బావుంది’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:కట్టప్ప..బాహుబలిని చంపడంపై కేటీఆర్‌- రానా ట్వీట్ యుద్ధం

ఇవి కూడా చదవండి:సెక్స్ లో అలా చేసి ప్రాణాలు కోల్పోయిన లేడి డాక్టర్

English summary

Tollywood Super Star Mahesh Babu's recent flick was "Brahmotsavam" and this movie was going with good talk at the box office and Mahesh Babu's Father Super Star Krishna Praises Mahesh Babu and Brahmotsavam Movie.