కేసీఆర్ ని అశోకునితో పోల్చిన సూపర్ స్టార్

Super Star Krishna praises KCR

10:33 AM ON 13th July, 2016 By Mirchi Vilas

Super Star Krishna praises KCR

అప్పట్లో జేమ్స్ బాండ్, గూడాచారి సినిమాలతో ఆ తర్వాత సోషియో ఫాంటసీ తదితర సినిమాలతో డేరింగ్ డేషింగ్ హీరోగా రాణించిన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ, ఒక్కసారిగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఏకంగా అశోకుడితో పోల్చారు. మంగళవారం నానక్ రాంగూడలోని ప్రభుత్వ స్కూల్ లో తన సతీమణి విజయనిర్మల, నటుడు నరేష్ లతో కలిసి ఆయన మొక్కలు నాటారు. చిన్నతనంలో అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించినట్లు హిస్టరీలో చదువుకున్నామని, నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరితో మొక్కలు నాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని సూపర్ స్టార్ కితాబిచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహరం పేరుతో మొక్కలు నాటే కార్యకమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అయితే ఒక్కసారిగా సీఎం కేసీఆర్ పై సూపర్ స్టార్ పొగడ్తలేంటి అంటూ సోషల్ మీడియాలో చర్చ స్టార్ట్ అయింది. గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిని కృష్ణ కలిసినప్పుడు కూడా ఇదే రేంజ్ లో చెప్పుకొచ్చారంటూ గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన హరితహారం అనుకున్న లక్ష్యాల్ని అధిగమించిందని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నా, వాటి బాధ్యతలను కూడా ఎవరికో ఒకరికి అప్పగిస్తే మంచిదని, లేకుంటే ఎన్ని మొక్కలు నాటినా ప్రయోజనం ఉండదని పలువురు నెటిజన్లు అంటున్నారు.

English summary

Super Star Krishna praises KCR