ఏ హడావిడి లేకుండా ఇండియా వచ్చిన రజనీ..

Super Star RajaniKanth back to India

01:47 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Super Star RajaniKanth back to India

ఓ పక్క కబాలి రిలీజ్ మరోపక్క సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇండియా వచ్చేసాడు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న క్షణాలు వచ్చేశాయి. రజినీకాంత్ ఇండియాకు వచ్చి, ఆదివారమే చెన్నైలో అడుగుపెట్టారు. ఎలాంటి హడావుడి లేకుండా తన కూతురు సౌందర్యతో కలిసి ఆయన అమెరికా నుంచి చెన్నై చేరుకున్నారు. టీషర్ట్ దాని మీద జాకెట్ వేసుకుని.. నెత్తిన టోపీ.. గాగుల్స్ పెట్టుకుని.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని జనాలు గుర్తుపట్టకుండా ఉండేలా తయారైన రజినీ.. సింపుల్ గా ఎయిర్ పోర్టులో నడుచుకుంటూ వస్తూ కనిపించారు. అయినా మీడియా వాళ్లు ఆయన వెంటపడ్డారు. కబాలి ఇక్కడ ప్రభంజనం సృష్టిస్తున్న టైంలో ఆయన అమెరికాలో గడిపారు. అనారోగ్య కారణాలతో రెండు నెలల కిందట రజినీ అమెరికాకు వెళ్లి, అక్కడే చికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకున్న రజినీ అక్కడే కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్ని సందర్శించారు.

రజినీకి ఏమైందో అన్న ఆందోళన పెరిగిపోతున్న టైంలో తన అమెరికా పర్యటనకు సంబంధించి కొన్ని ఫొటోలు విడుదల చేసి టెన్షన్ తగ్గించారు. ఆ తర్వాత కబాలి ప్రివ్యూ షో కూడా అమెరికాలోనే చూశారు రజినీ. కబాలి విడుదలకు ముందే ఈ నెల 20న రజినీ చెన్నై చేరుకుంటారని వార్తలొచ్చాయి కానీ, సినిమా విడుదల తర్వాతే వచ్చారు. ఇంట్లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆగస్టులో రోబో-2 కొత్త షెడ్యూల్ షూటింగుకి వెళ్తారని అంటున్నారు. మూడు నెలల పాటు రజినీ నిర్విరామంగా షూటింగులో పాల్గొని ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

English summary

Super Star RajaniKanth back to India