సింధు.. నేను నీ ఫ్యాన్‌ని అయిపోయానంటున్న రజినీకాంత్

Super Star Rajinikanth Congratulates Olympic Silver Medalist PV Sindhu

10:56 AM ON 20th August, 2016 By Mirchi Vilas

Super Star Rajinikanth Congratulates Olympic Silver Medalist PV Sindhu

సినిమా వాళ్లకి అభిమానులుంటారు. క్రికెటర్లకు కూడా వుంటారు. కానీ కొందరు అగ్ర నటులకు తమ హీరోయే దైవం. అలాంటి హీరోల్లో ప్రముఖుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ కి వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అలాంటి రజనీ కూడా ఓ క్రీడాకారిణికి అభిమాని అయ్యాడు. ఎవరు అంటుకుంటున్నారా? ఇంకెవరు , రియోలో సగర్వంగా రజత పతకం అందుకుని భారత కీర్తి పతాకను వినువీధుల్లో రెపరెపలాడించిన పీవీ సింధుయే. అవును, సింధుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రధాని మోడీ నుంచి సినీ ప్రముఖుల వరకు ఆమెను ప్రశంసల జడివానలో ముంచెత్తుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే ఏకంగా సింధుకు తాను ఫ్యాన్ అని పేర్కొన్నాడు. సింధు ఫైనల్ పోరు అనంతరం కబాలి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, సింధుకు తాను గొప్ప ఫ్యాన్ అయిపోయానని పేర్కొన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యు అంటూ అభినందనలు తెలిపారు.

English summary

Super Star Rajinikanth Congratulates latest Badminton Sensation and Rio Olympics Silver medalist Pv Sindhu for winning a medal. Rajinikanth said that he became her fan by seeing her performance in Rio Olympics.