దేవుడి చిత్తం ఉంటే.. పాలిటిక్స్ లోకి సూపర్ స్టార్...

Super Star Rajinikanth into politics

06:22 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Super Star Rajinikanth into politics

తమిళనాట రాజకీయాలు భలే రంజుగా ఉంటాయి. ఒకసారి అభిమానిస్తే, తమిళ తంబీలు వదిలిపెట్టరు. తేడా వచ్చినా అంతే మరి. అందుకే ఒకసారి ఓ పార్టీకి, మరోసారి మరోపార్టీకి అవకాశం ఇస్తూ వచ్చే తంబీలు ఈసారి ఏకంగా రెండవసారి జయలలితను అధికారం పీఠం ఎక్కించారు. ఇక ప్రతిసారి రాజకీయాల్లోకి వస్తాడా రాడా అని ఊరించే, రజనీ ఈసారి దేవుని చిత్తం ఉంటే వస్తానని అన్నాడట. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తమిళనాట సూపర్ స్టార్ కి వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అతడి యాక్షన్, డైలాగ్ ఏదైనా సరే ఫాన్స్ చప్పట్లు కొట్టేస్తారు. 'నా దారి రహదారి..' 'నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..' 'రావాల్సిన సమయానికి సరిగ్గా వస్తాను..' 'కబాలి రా..' అంటూ వెండి తెర మీద తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పే పంచ్ డైలాగులు సగటు సినీ ప్రేక్షకులు తమను తాము మరిచిపోతుంటారు.

1/4 Pages

రజనీ చెప్పే డైలాగుల్లోని మర్మాన్ని అర్థం చేసుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఇక పొలిటికల్ ఎంట్రీ మీద చాలానే ఊహాగానాలు జోరుగా సాగుతుంటాయి. అయితే, అందులో నిజానిజాలు అందరికి తెలిసినవే. అప్పుడెప్పుడో రజనీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ వచ్చినమాటలు సంచలనం సృష్టించాయి. చాలానే అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అవేమీ వర్కౌట్ కాలేదు. కాలక్రమంలో రజనీ రాజకీయాల్లోకి వస్తారన్నది ఒక అపనమ్మకంగా మారిపోయింది. ఓ పక్క అనారోగ్యం.. మరోపక్క వయసు మీద పడుతున్న వేళ, తన తీరుకు భిన్నంగా ఉండే రాజకీయాల్లోకి రజనీ ఎంట్రీ ఇస్తే నెట్టుకు రాగలరా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

English summary

Super Star Rajinikanth into politics