వేసవిలో పోటీ పడనున్న సూపర్‌స్టార్స్‌

Super Stars To Competete In Summer

11:34 AM ON 1st December, 2015 By Mirchi Vilas

Super Stars To Competete In Summer

వేసవి కాలం అనగానే స్టార్‌ హీరోలు తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువరావడానికి తెగ ఆరాటపడుతుంటారు. ఈ సారి వచ్చే 2016 వేసవిలో మాత్రం ముగ్గురు స్టార్‌ హీరోలు వేసవి బరిలో ఢీ కొనబోతున్నారు . సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి' తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఏప్రిల్‌ 10 న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తునట్లు సమాచారం. కబాలి చిత్రానికి యంగ్‌ డైరెక్టర్‌ రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు .ఇది ఇలా ఉండగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ప్రిన్స్‌ మహేష్‌బాబు నటిస్తున్న 'బ్రహ్మూెత్సవం' చిత్రాన్ని ఏప్రిల్‌ 8న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి సూపర్ హిట్ సినిమా తరువాత దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల,మహేష్‌బాబు కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై బారి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే మరో హీరో స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా తను నటిస్తున్న కొత్త సినిమా 'సరైనోడు' చిత్రంతో వేసవి బరిలో దిగుతున్నట్లు సమాచారం. గత వేసవిల్లో వచ్చిన రేసుగుర్రం , సన్ అఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలతో మంచి ఊపు మీదున్నఅల్లు అర్జున్ ,సరైనోడు చట్రాన్ని కుడా వేసవికి విడుదల చెయ్యుటకు సన్నాహాలు చేస్తున్నాడు . సరైనోడు చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ బ్యానర్‌ పై పవర్‌పుల్‌ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి వచ్చే వేసవికి స్టార్‌ హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీసు వద్ద పోటి పడడం ఖాయంగా కనిపిస్తుంది.

English summary

Coming Summer is going to blast with the movies of top heros in the industry. Mahesh Babu ,rajini kanth,allu arjun to compitete with their movies in next summer