ఎమోషనల్‌ హిట్‌ కానున్న 'నాన్నకు ప్రేమతో'

Superb Emotional Content In Nannaku Prematho

11:41 AM ON 7th January, 2016 By Mirchi Vilas

Superb Emotional Content In Nannaku Prematho

సంక్రాంతికి రిలీజ్‌ కానున్న సినిమాలలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన నాన్నకుప్రేమతో ఒకటి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్‌ అవ్వడానికి సిద్దం అవుతుంది. నాన్నకు ప్రేమతో ఫాదర్‌ సెంటిమెంట్‌ ఎక్కువగా ఉన్న సినిమా అని టైటిల్‌ చూస్తేనే అందరికీ అర్ధమవుతుంది. సినిమా క్లైమాక్స్‌ లో ఫాదర్‌ సెంటిమెంట్‌ పీక్స్‌లో ఉంటుందట. ఎమోషనల్‌ క్లైమాక్స్‌ అనగానే గుర్తుకు వచ్చేది 'అత్తారింటికి దారేది' ఆ తరువాత వచ్చిన ఏ సినిమా కుడా అంతగా ఎమోషన్ వర్కౌట్‌ కాలేదు. అయితే అత్తారింటికి దారేది సినిమాలో కన్నా ఎక్కువ ఎమోషనల్‌ కంటెంట్‌ నాన్నకు ప్రేమతో లో ఉందంట. ఈ ఎమోషనల్‌ కి అందరూ కనెక్ట్‌ అయి కంటతడి పెట్టుకునే విధంగా ఉంటుందట. ఈ సినిమా ఖచ్చితంగా పెద్దహిట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ గట్టి నమ్మకంతో ఉంది.

English summary

Upcoming NTR's movie was going to be released on january 13th.A news came to know thaat the climax of the movie was superb