అవును కబాలి సింహంలా గర్జించాడట

Superstar Rajinikanth Roared Like lion

11:13 AM ON 1st July, 2016 By Mirchi Vilas

Superstar Rajinikanth Roared Like lion

విభిన్న శైలి, వ్యక్తిత్వం గల సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి ఆడియో ఫంక్షన్ కి కూడా రజనీ రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ఆరోగ్యం బాగాలేక వైద్య పరీక్షలకోసం అమెరికా వెళ్ళారని, అక్కడ శస్త్ర చికిత్సలు చేయించుకున్నారని వచ్చిన వార్తలకు ఆయన సోదరుడు సత్యనారాయణ ఫుల్ స్టాప్ పెట్టారు. x అయితే రజనీ హెల్త్ బాగుందని, కేవలం మెడికల్ టెస్టు ల కోసమే యూఎస్ వెళ్ళారని స్పష్టం చేశారు. ఇక లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహా లింగం ట్వీట్ చేస్తూ సూపర్ స్టార్ ఆరోగ్యంపై వచ్చిన వదంతులను నమ్మవద్దని కోరారు. గురువారం ఉదయం రజనీ తనకు కాల్ చేసి సింహంలా గర్జించారని పేర్కొన్నారు. దీంతో రజనీ హెల్త్ మీద వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయింది. త్వరలో ఆయన ఇండియా రావచ్చునని భావిస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 2.0 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇక కబాలి చిత్రం సృష్టించే సంచలనం పైనే అందరి దృష్టి ఉంది.

ఇది కూడా చూడండి: 4 రోజుల్లో బరువు తగ్గడం ఎలా?

ఇది కూడా చూడండి: టాలీవుడ్ హీరో ల పారితోషికాలు

ఇది కూడా చూడండి: పేరు లో మొదటి అక్షరం ఏం చెప్తుంది ?

English summary

Raju Mahalingam said that "Our SUPERSTAR called me this morning and ROARED like a LION !!! Hope all RUMOURS are put to REST !!! MAGILCHI!!!".