పొగతాగడం పై

Supreme Court Asks Proof That Smoking Causes Cancer

01:29 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Supreme Court Asks Proof That Smoking Causes Cancer

సిగరెట్లు తాగకండి..సిగరెట్ల తాగడం వల్ల కాన్సర్ వస్తుంది అంటూ.. ఇటు సినిమా హాల్స్ లోను అటు బుల్లి తెరపైనా ఇలా అన్ని చోట్ల ప్రభుత్వం ప్రచారం చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ విషయమై ఒక ప్రశ్న వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. సిగరెట్లు తాగితే కాన్సర్ వస్తుందని అనడానికి ఆధారాలు ఏమైన ఉన్నాయా అని ప్రశ్నించింది.

ప్రస్తుతం మార్కెట్లో అమ్మే పలు రకాల సిగరెట్ ప్యాకెట్లు చాలా అందంగా రంగు రంగులతో ఆకర్షణీయంగా ఉంటున్నాయని. వీటి వల్ల ఎక్కువగా యువత వీటికి అలవాటు పడే అవకాశం ఉందని , సిగరెట్ ప్యాకెట్ల పై ఎటువంటి రంగు లేకుండా తయారు చెయ్యాలని అంటూ న్యాయవాది ఐశ్వర్య భాతి సుప్రిం కోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై స్పందించిన సుప్రిం కోర్ట్ జడ్జ్ టి.ఎస్.ఠాకూర్ సిగరెట్లు తాగడం వలనే క్యాన్సర్ వస్తుందని ఎలా చెప్పగలరు , దీన్ని మీరు రుజువు చెయ్యగలరా అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. సిగరెట్లు కాల్చే అలవాటు లేని వారు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని , సిగరెట్లు కాల్చే అలవాటు ఉన్న వాళ్లు చాలా మంది చివరి వరకు ఆరోగ్యంగా జీవిస్తున్నారని సుప్రిం కోర్టు అభిప్రాయపడింది. స్వయంగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అయినా సుప్రీం కోర్ట్ ఇలా అనడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు.

English summary

Supreme Courts asks the proofs about Smoking causes cancer.Recently a Lawyer filed a petition on supreme court to avoid colorful logos on Cigarette packets.Supreme court responds on this case and asks the reasons to show.Supreme court also says that so many people were living well when smoking from years.