నోట్ల రద్దుపై సుప్రీం ప్రశ్నల వర్షం ... కేంద్రం ఉక్కిరిబిక్కిరి

Supreme Court Asks Questions From Centre Over Demonetisation

11:14 AM ON 10th December, 2016 By Mirchi Vilas

Supreme Court Asks Questions From Centre Over Demonetisation

ప్రధాని మోడీ పెద్ద నోట్లరద్దు వ్యవహారం ఇప్పుడు చిక్కు సమస్యలు వెంటాడుతుంటే, సుప్రీం కోరు కోర్టు కూడా ఈ అంశంపై ప్రశ్నలవర్షం కురిపించింది. నోట్ల రద్దు నిర్ణయం ప్రయోజనాలు ఏంటని ప్రశ్నించింది. నోట్ల రద్దు విధానంపై నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? అది కాన్ఫిడెన్షియల్ గానే ఉంచారా? ఒక వ్యక్తి ఒక రోజుకు 24,000 రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని కేంద్రం ఆదేశించడం వెనుక హేతుబద్ధత ఏమిటి? వంటి తొమ్మిది ప్రశ్నలను త్రిసభ్య న్యాయమూర్తుల బెంచ్ కేంద్రానికి సంధించింది.

పెద్దకరెన్సీనోట్ల రద్దుమీద దాఖలైన వివిధ పిటిషన్లపై శుక్రవారం విచారణ మొదలుపెట్టిన సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. అటార్నీ జనరల్ రోహత్గి కేంద్రం తరఫు వాదనలను అత్యున్నత న్యాయస్థానం ముందుంచారు. దీనిపై రోహత్గి వివరణ ఇస్తూ నల్లధనంపై పోరాటం, తీవ్రవాదులకు నిధులు అందకుండా చేయడం వంటి కారణాల రీత్యా పెద్ద నోట్లు రద్దు నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందని వివరించారు.

నోట్ల రద్దు వల్ల సాధారణ ప్రజానీకానికి ఏర్పడిన ఇబ్బందులు తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుందన్నారు. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

ఇది కూడా చూడండి: రామానుజాచార్యులు గురించి తెలుసుకుందాం...

ఇది కూడా చూడండి: వివాహానికి ముందు వధూవరులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే!

ఇది కూడా చూడండి: శ్రీ కాళహస్తి పూజలు చేయించుకున్నవారు తిరుమల ఎందుకు వెళ్ళకూడదు.!

English summary

Supreme Court Asks Questions From Centre Over Demonetisation