బడాబాబులపై  కొరడా ఝళిపించిన 'సుప్రీం'    

Supreme Court Fires On RBI

09:43 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Supreme Court Fires On RBI

చిన్నచిన్న వాళ్ళు లోన్ తీసుకుంటే, వాటిని ఒకవేళ కట్టలేకపోతే ,ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు బడా బాబులు ఎన్ని వేల కోట్లు ఎగవేసినా, కిమ్మనకుండా వ్యవహరించడం చూస్తూనే వున్నాం. దీనికి కారణం ఈ బడాబాబులు రాజకీయ నేతలుగా వుండడం , రాజకీయ అండ వుండడం కూడా తెల్సిందే. అందుచేత బ్యాంకర్లు ఇలాంటి వాళ్ళ పట్ల ఉదాసీనంగా ఉంటున్నాయి. ఫలితంగా మన దేశ ఆర్ధిక వ్యవస్థ పై పడుతున్న భారం అంతా ఇంతా కాదు. ఇంకోపక్క డిఫాల్ట‌ర్లంతా దేశ నేత‌లుగా మారుతున్నారు. పార్టీలు, ప‌ద‌వులు అడ్డుపెట్టుకుని పెద్ద మ‌నుషులుగా చెలామ‌ణీ అయిపోతున్నారు. సెలబ్రిటీలు కూడా తోడ‌య్యి బ్యాంకుల‌ను నిలువునా ముంచుతున్నారు. ప్ర‌జాధ‌నం కాజేసి కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతుంటే, ఇక బ్యాంకుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయ్యరవుతోంది. ఇదిగో ఇది గమనించిన సుప్రీం కొరడా ఝళిపించింది.

సామాన్యుడు చిన్న చిన్న రుణాలు తీసుకుని చెల్లించ‌క‌పోతే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బ్యాంకులు పెద్ద మ‌నుషుల ద‌గ్గ‌ర ఎందుకు ఉదాశీనంగా ఉంటున్నాయ‌ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు ప్ర‌జాధ‌నం విష‌యంలో నిర్లిప్త‌త కూడ‌ద‌ని చురక వేసింది. 500 కోట్ల రూపాయ‌ల‌కు పైగా బ‌కాయిలు ఉన్న అన్ని సంస్థ‌ల ఆస్తులు జ‌ప్తు చేయాల‌ని ఆదేశించింది. కార్పోరేట్ కంపెనీల పేరుతో తీసుకున్న రుణాలు ఎగ‌వేత‌ను స‌హించ‌కూడ‌ద‌ని తేల్చి చెప్పింది. నేరుగా రుణాల విష‌యంపై ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ కు నోటీసులు జారీ చేసింది.

ఇక సుప్రీం జోక్యంతో ఇప్పుడు ప‌లువురు తెలుగు ప్ర‌ముఖుల‌కు త‌ల‌నొప్పులు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది. అధికారంలో ఉన్న పెద్ద‌ల సాయంతో అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారికి ఇప్పుడు పప్పులు ఉడకవని చెప్పవచ్చు. ముఖ్యంగా ప‌లు కార్పోరేట్ సంస్థ‌లు న‌డుపుతున్న కేంధ్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి,కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు , ఎంపీ రాయ‌పాటి సాంబశివరావు , మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్ గోపాల్ , టాలీవుడ్ ప్ర‌ముఖుడు అక్కినేని నాగార్జున‌ , ఇమేజ్ గ్రూప్ సంస్థ‌ల అధినేత సీవీరావు స‌హా దేశంలోనే ప్ర‌ముఖులుగా ఉన్న జీఎంఆర్ మ‌ల్లిఖార్జున రావు, జీవీకే కృష్ణారెడ్డి వంటి వారి పేర్లు ఇప్ప‌టికే డీఫాల్ట‌ర్ల లిస్టులో చేరాయని అంటున్నారు. అలాగే కింగ్ ఫిష‌ర్ విజ‌య్ మాల్యా నుంచి కేంధ్రంలో అధికారం అనుభ‌విస్తున్న ప‌లువురు నేత‌ల కంపెనీలు కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వీళ్లంద‌రి ఆస్తులు జప్తు చేయాల‌న్న సుప్రీంకోర్ట్ ఆదేశాల ప్ర‌భావం తీవ్రంగా ఉండే ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కావూరి, రాయ‌పాటి వంటి వారి ఆస్తుల జ‌ప్తు కోసం ఓ ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే. నాగ‌ర్జున విషయంలోనూ అదే జ‌రిగింది. కానీ ప‌లుకుబ‌డితో వాటిని గుట్టు చప్పుడు కాకుండా సెటిల్ చేస్తున్నట్లు కూడా జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అంతా సైలెంట్ అయిపోవ‌డంతో ఈ ప్రచారానికి బలం చేకూరిందన్న మాటలు వినిపిస్తున్నాయి. సీవీఆర్ న్యూస్ య‌జ‌మానికి సీవీరావు విష‌యంలోనూ ఈ తంతే. అయితే సుప్రీం జోక్యంతో వీరంతా ఇప్పుడు ఇరు కున పడ్డట్టే నని అంటున్నారు. కోర్ట్ ఆదేశాల‌తో ఇలాంటి వ్య‌వ‌హారాల‌కు చెక్ ప‌డుతుంద‌ని అంతా నమ్ముతున్నారు.

కావూరి ప్రోగ్రెసివ్ క‌న‌స్ట్ర‌క్ష‌న్ పేరుతో తీసుకున్న రుణం చెల్లించ‌క‌పోవ‌డంతో హైద‌రాబాద్ లోని ఆయ‌న ఆస్తులు జ‌ప్తు చేశారు. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ట్రాన్స్ ట్రాయ్ రుణాల కోసం గుంటూరులోని ఆయ‌న ఇంటిని కూడా జ‌ప్తు చేస్తామ‌ని నోటీలిచ్చారు. ఇక ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశం మేరకు ఈ ప్ర‌క్రియ వేగ‌వంతం అవుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా బాంకింగ్ రంగం గట్టి గా జూలు విదిలిస్తే , ఈ బడాబాబుల నుంచి రికవరీ ఈజియే నని పలువురు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో...

English summary

Supreme court fires on Reserve Bank Of India.Supreme Court Tuesday ordered the Reserve Bank of India (RBI) to share with it names of all defaulters who owe over Rs 500 crore and continue to lead “lavish lifestyle”.