రాహుల్ కు దిమ్మతిరిగే షాక్

Supreme Court Gave Shock To Rahul Gandhi

10:43 AM ON 20th July, 2016 By Mirchi Vilas

Supreme Court Gave Shock To Rahul Gandhi

రాజకీయాలన్నాక కాస్త హుందాగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు చుట్టుముడతాయి. పట్టువిడుపులు లేని రాజకీయాలు వ్యర్థం అని ఎన్నోసార్లు రుజువయ్యాయి. అయినా సరే రాజకీయనేతల విమర్శలు-ప్రతివిమర్శలు హద్దులు దాటిపోతున్నాయి. వాస్తవాలను పక్కనపెట్టి తమ స్థాయిని మర్చిపోయి మరీ పొలిటికల్ లీడర్స్ ఆరోపణలకు దిగుతున్నారు. తాజాగా ఈ తరహా కామెంట్ చేసినందుకే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. మహాత్మాగాంధీని ఆరెస్సెస్ హత్య చేసిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. నేరుగా ఒక సంస్థపై ఇంతపెద్ద దోషాన్ని ఎలా మోపగలవు..? ఆ వ్యాఖ్యలను ఎలా సమర్థించగలవు? అంటూ ప్రశ్నలు గుప్పించింది.

'ఒక అంశాన్ని యోగ్యత ఆధారంగా నిర్ణయించాలి. మీరు ఏం మాట్లాడుతున్నారో అది ప్రజల మంచికా కాదా అనే విషయాన్ని ఆలోచించాలి. ఒక సంస్థపై నేరుగా దోషారోపణ చేయలేరు' అంటూ రాహుల్ కు సుప్రీంకోర్టు అల్టిమేటం ఇచ్చింది. దీనిపై క్షమాపణ అయినా చెప్పాలి లేదా.. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అందుకుగాను రాహుల్ గాంధీకి ఈ నెల27వరకు గడువు ఇచ్చింది. మరి ఇప్పుడు ఈ యువరాజు ఏమి చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:ఆవు చేలో మేసింది... మహిళ వేళ్లు నరికేశారు

ఇవి కూడా చదవండి:పాపం... గిన్నెలు కడిగిన కేజ్రీ..

English summary

AICC Vice President Rahul Gandhi was booked in a controversial issue for saying that Mahatma Gandhi Died because of RSS. Supreme Court ordered Rahul Gandhi to Say Sorry or to come for Investigation.