నిర్భయ కేసులో అరణ్య రోదన 

Supreme Court On Nirbhaya Case

07:06 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Supreme Court On Nirbhaya Case

నిర్భయ కేసులో బాదితురాలి తల్లిదండ్రుల ఆవేదన అరణ్య రోదన అయింది. దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిర్భయ కేసులోని బాలనేరస్తుడి ని జైలులోనే వుంచాలన్న డిమాండ్ నీరుగారిపోయింది. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చట్టప్రకారమే స్పందించింది. ఇక మహిళా కమీషన్ పిటీషన్ వేసినా, ఫలితం లేకుండాపోయింది. ఆనాడు డిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతంలో మూడేళ్ల జైలుశిక్షకు గురై.. శిక్షాకాలం పూర్తి అయిన నేపథ్యంలో జైలు నుంచి విడుదల చేసే విషయంలో మహిళా సంఘాలు.. బాధిత తల్లిదండ్రుల ఆవేదన ఎందుకూ కొరగాకుండా పోయింది.

ప్రజల మనసు తమకు తెలుసని.. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము చట్టానికి కట్టుబడే ఉండాలని సుప్రీం కోర్టు పేర్కొంటూ, చట్టం మీరటం ధర్మం కాదంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం బాలనేరస్తులకు మూడేళ్లకు మించి జైలుశిక్ష విధించే చట్టం దేశంలో లేదని.. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఇంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని సుప్రీం వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో బాలనేరస్తుడి విడుదలపై స్టే ఇవ్వటం సాధ్యం కాదని తేల్చి.. దీని పై మహిళా కమిషన్ దాఖలు చేసిన పిటీషన్ ను తిరస్కరించింది. మరోపక్క సోషల్ మీడయాలో కూడా దీనిపై పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యానాలు వచ్చాయి.

కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత డి పురందరేశ్వరి సైతం నిర్భయ కేసులో బాల నేరస్తుడిని వదిలిపెట్టడం సమంజసం కాదన్నారు. కాగా విడుదలైన బాల నేరస్తుడు ఓ స్వచ్చంద సంస్థ ఆధీనంలో వున్నాడు. ఈ కేసులో ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని , నిందితుడు తప్పించుకోకూడదని బాధిత తల్లిదండ్రులు అంటున్నారు. పలువురు మహిళలు కూడా ఇలాగే స్పందిస్తున్నారు.

దారుణమైన నేరానికి పాల్పడిన నిర్భయ ఉదంతంపై కఠిన శిక్షలు వేయాలని అప్పట్లో ఘోషించిన నేతలు ఆతర్వాత ఇందుకవసరమైన చట్టాలను రూపొందించడంలో శ్రద్ధ చూపలేదన్నది వాస్తవం. అందుకే దేశ వ్యాప్తంగా నిరసనలు వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు మార్పు ఎప్పుడు వస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న కాకూడదన్నది పలువురి అభిమతం.

English summary

A minor accused member who were in the case of nirbhaya was ready to release by supreme court. Central Government and various women associations has requested delhi high court not release him.