వోడాఫోన్‌ 2000కోట్లు కట్టాల్సిందే

Supreme Court Orders Vodafone To Pay 2000 Crores

11:35 AM ON 24th November, 2015 By Mirchi Vilas

Supreme Court Orders Vodafone To Pay 2000 Crores

దేశంలోనే రెండవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్‌ సంస్థగా ఉన్న వోడాఫోన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సంస్థ పునరవ్యవస్థీకరణలో భాగంగా వోడాఫోన్‌ మొబైల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ చెల్లించాల్సిన 2000కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు వోడాఫోన్‌కు తెలిపింది.

వోడాఫోన్‌ ఈస్ట్‌, వోడాఫోన్‌ సెల్యులర్‌, వోడాఫోన్‌ సౌత్‌, వోడాఫోన్‌ డిజిలింక్‌ అనే నాలుగు సంస్థలను కలిపి వోడాఫోన్‌ మొబైల్‌ సర్వీసెస్‌గా ఆవిర్భవించిన కంపెనీ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యింది. అయితే ఈ నాలుగు కంపెనీల విలీనానికి ముందు 1773కోట్లను విలీనానికి ముందు సంస్థలు చెల్లించాల్సి ఉండగా, వాటిని చెల్లిస్తామని సదరు సంస్థలు హామీ ఇచ్చిన మీదనే ప్రభుత్వం స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యేందుకు అనుమతి పొందాయి. కానీ తీరా వోడాఫోన్‌ మొబైల్‌ సర్వీసెస్‌ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కాగానే ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కాకమ్మ కథలు అన్నీ చెబుతుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును ఎగ్గొట్టేందుకు సకల ప్రయత్నాలు చేసిన వోడాఫోన్‌తో విసుగెత్తిన ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అక్కడ కూడా వోడాఫోన్‌కు చుక్కెదురైంది. వడ్డీతో కలిపి 2000కోట్లు వోడాఫోన్‌ కట్టాల్సిందేనంటూ కోర్టు వోడాఫోన్‌ను మొట్టికాయ వేసింది.

English summary

Supreme Court orders Vodafone To Deposit A Huge Ammount Of 2000 crores to approve the mergeing of four vodafone mobile services