వాట్సాప్ లో రేప్ వీడియోలపై సుప్రీం సీరియస్!

Supreme court serious on rape videos in whatsapp

03:08 PM ON 22nd November, 2016 By Mirchi Vilas

Supreme court serious on rape videos in whatsapp

సోషల్ మీడియాకు సంబంధించి, వాట్సాప్ లో అత్యాచారం వీడియోల నియంత్రణపై ఏం చర్యలు తీసుకుంటున్నారో 11 నెలలుగా సమాధానం చెప్పకపోవడంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. జస్టిస్ ఎం.బీ.లోకూర్, జస్టిస్ యు.యు.లలిత్ తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ కేసు విచారించింది. సైబర్ నేరాల కేసుల దర్యాప్తుకు సంబంధించి స్పష్టమైన విధి విధానాలు రూపొందించకపోవడాన్ని కూడా కోర్టు తప్పు పట్టింది. దీనిపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

1/3 Pages

అత్యాచార దృశ్యాలు విచ్చలవిడిగా సామాజిక మాథ్యమంలో ప్రచారం కావడంపై హైదరాబాద్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల గతంలో సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. ఆ లేఖతో పాటు వాట్సాప్ లో ప్రచారంలో ఉన్న రెండు అత్యాచార దృశ్యాలను కూడా పెన్ డ్రైవ్ లో అప్పుడు చీఫ్ జస్టీస్ గా ఉన్న హెచ్ఎల్ దత్తూకు పంపించింది.

English summary

Supreme court serious on rape videos in whatsapp