రోజాకు సుప్రీం లోనూ ఎదురు దెబ్బ

Supreme Court Supports Suspension Of Roja

11:13 AM ON 12th March, 2016 By Mirchi Vilas

Supreme Court Supports Suspension Of Roja

కాలం కల్సి రాకపోతే, అన్నీ ఆటంకాలే ... ప్రస్తుతం సినీ నటి - వైఎస్సీర్సీపీ ఎమ్మెల్యే రోజా తనను ఏడాది పాటు అసెంబ్లీ సమావేశాలకు రానీయకుండా తెలుగుదేశం పార్టీ చేయడం పై న్యాయ పోరాటం చేయడానికి దిగినా ఫలితం లేకుండా పోయింది. సుప్రీమ్ కోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలింది. శాసనసభ తీసుకున్న నిర్ణయంపై తామేమీ చేయలేమని సుప్రీమ్ కోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ తెల్చేయడంతో రోజా పరిస్థితి అయోమయంలో పడింది.

గత అసెంబ్లీ సమావేశాల్లో రోజా అసభ్య పదజాలంతో సభామర్యాదలను మంటగలిపారనే నెపంతో ఏడాది పాటు శాసనసభ నుంచి వెలేసిన విషయం తెలిసిందే. ఓ మహిళా శాసనసభ్యురాలి పై ఇలాంటి చర్య తీసుకోవడం.. బహుశా శాసనసభ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. తమ ఎమ్మెల్యేను ఏడాదిపాటు శాసనసభకు రానీయకుండా నిషేధం విధించడానికి స్పీకర్ కు ఎలాంటి అధికారం లేదని జగన్ అండ్ బ్యాచ్ వాదిస్తూ వచ్చింది. అలాంటి అధికారం స్పీకర్ కు లేకపోయినా, సభలోని మెజారిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరని ఒకవేళ అది తప్పని కోర్టుకు వెళ్లినా ఫలితం వుండదని గతంలోనే శాసనభావ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేసిన సంగతి తెల్సిందే. ఎలాగైనా న్యాయపోరాటం చేయాలనుకున్న వైఎస్సార్సీకి ఇది గట్టి దెబ్బే. అయితే రోజా తరఫు న్యాయవాది మరో బెంచ్ కు వెళతాం అంటున్నారట. మరి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం.

English summary

Actor and Ysrcp MLA Roja has been suspended for one year from Andhra Pradesh Assembly for her worst behaviour.She had appeal Assembly decision in Supreme Court but Supreme court said that Supreme court cant do anything in this issue.