చనిపోతానని మాట ఈ సీఎం నోట ఎందుకు వచ్చింది?

Supreme Sensational Judgement On Singur Land Case

11:39 AM ON 1st September, 2016 By Mirchi Vilas

Supreme Sensational Judgement On Singur Land Case

ఈ దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ కి ఓ చరిత్ర వుంది. అందునా అందరూ దీదీ అని పిలిచే సీఎం మమతా బెనర్జీకి ఓ ప్రత్యేకత వుంది. కరుడుగట్టిన కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన మమతా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా మరోమారు విజయ భేరి మోగించారు. కమిట్ మెంట్ వున్న నాయకురాలు ఈమె. మనో నిబ్బరం, ఆత్మవిశ్వాసం పుష్కలంగా గల దీదీ నోట అసలు చనిపోతానని మాట ఎందుకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే,

1/6 Pages

నానో కార్ల తయారీకి వెయ్యి ఎకరాలు ...


 

టాటా మోటార్స్ కు సింగూరులో నానో కార్ల తయారీ కోసం 2006లో అప్పటి వామపక్ష ప్రభుత్వం 1000 ఎకరాల భూమిని టాటా మోటార్స్ కు కట్టబెట్టింది. ఈ ప్లాంట్ కు వ్యతిరేకంగా అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో టాటా మోటార్స్ నానో కార్ల తయారీ కేంద్రాన్ని 2008లో గుజరాత్ కు మార్చింది. 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి రాగానే...టాటా మోటార్స్ కు వామపక్ష ప్రభుత్వం అప్పగించిన సింగూర్ భూములను స్వాధీనం చేసుకునేందుకు చట్టం తీసుకువచ్చింది. దీనిని టాటా మోటార్స్ కోల్ కతా హైకోర్టులో సవాలు చేసింది. అనంతరం కేసు సుప్రీంకోర్టుకు చేరింది.

English summary

Supreme Court announced its final judgement on Singur Land case in West Bengal. In 2002 West Bengal Government had allotted 1000 acres of land to Tata Motors for Nano Cars Assembling Plant. But Present West Bengal Chief Minister Mamata Benarjee files case and Supreme Court Announced its final Judgement which was favourable to Mamata Benarjee.