ఆ ముగ్గురూ అంటే చాలా ఇష్టం

Surabhi Favourite Heros

10:22 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Surabhi Favourite Heros

‘బీరువా’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సురభి. ఆ తరవాత ఆమెకు బోల్డన్ని అవకాశాలొచ్చినా రెండో సినిమా కోసం ఆచితూచి అడుగులు వేసి, అనుకున్న ఫలితమే అందుకుంది. అదే సంక్రాంతికి విడుదలైన ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’. ఈ చిత్రం ద్వారా మరో విజయాన్ని నమోదు చేసుకున్న సురభి నటించిన ‘ఎటాక్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇది కాక నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అందులో సురభి కథానాయికగా నటించనుంది. పాత్రలు మంచివి ఎంచుకోవడం ద్వారా వీలైనన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఈ భామ ఉద్దేశ్యమట. ఇక తెలుగులో ప్రభాస్‌, మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్‌లంటే ఈమెకు బాగా ఇష్టంట. అలాగే మిగతా నాయకుల్నీ కూడా అభిమానిస్తుందట.

English summary