చాయ్ వాలా వద్ద రూ.400 కోట్లు

Surat Chaiwala Owns 400 Crores Assets

11:36 AM ON 20th December, 2016 By Mirchi Vilas

Surat Chaiwala Owns 400 Crores Assets

చాయ్ వాలా అనుకున్నారా కాదు కోట్లకు పడగలెత్తాడు. అవును టీ, వ్యాపారిని లక్ష్మీదేవి కటాక్షించింది. చాయ్ అమ్ముకునే స్థాయి నుంచి రుణదాతగా మార్చింది. కరెన్సీ, బంగారం, ఆభరణాలు, స్థిరాస్తులను ఇచ్చింది. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి ఆయనను తప్పించలేకపోయింది. ఆదాయపు పన్ను శాఖాధికారుల కళ్ళు ఆయన ఆస్తులపై పడ్డాయి. అన్నిటినీ లెక్కలేసి రూ.400 కోట్లు ఉంటుందని తేల్చి చెప్పారు. దీంతో టి వ్యాపారి, రుణదాత అయిన కిశోర్ భజియావాలా లబోదిబోమంటున్నాడు. ఆయనకు వివిధ బ్యాంకుల్లో 33 ఖాతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నగదు రూపంలో రూ.1.45 కోట్లు దొరికిందని, దీనిలో కొత్త కరెన్సీ విలువ రూ.1.05 కోట్లు అని చెప్పారు. బ్యాంకు లాకర్లలో 13 కిలోల బంగారం, 180 కిలోల వెండి కూడా ఉన్నట్లు తెలిపారు. కిశోర్ తనయులు జిగ్నేశ్, విలాస్ చెప్తున్నదాని ప్రకారం వారికి సూరత్ లోని 13 మంది బిల్డర్లతో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. నవంబరు 8న పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత కిశోర్ తన బ్యాంకు ఖాతాలో రూ.1.5 కోట్లు జమ చేశారు. దీంతో ఆయనపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల కన్ను పడింది. కూపీ లాగితే విషయం బయటపడింది.

ఇవి కూడా చదవండి: 24గంటల్లో 20 లక్షల వ్యూస్ తో మెగా రికార్డు

ఇవి కూడా చదవండి: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు ఉరి

English summary

IT Officials raid on a Chaiwala House in Surat and found 400 crore assets and they have seized 1 crore New Currency notes from him.