ఆ ఉద్యోగులకు దీపావళికి గిఫ్ట్ గా వెయ్యి కార్లు.. 400 ఫ్లాట్లు!

Surat diamond merchants businessman giving 1000 cars and 400 flats to employees for Diwali

11:18 AM ON 29th October, 2016 By Mirchi Vilas

Surat diamond merchants businessman giving 1000 cars and 400 flats to employees for Diwali

సాధారణంగా పండగ వస్తే అందరికీ ఆనందమే.. కానీ ఆ సంస్థలో సిబ్బందికి ఆనందం ఎప్పుడంటే దీపావళి పండగప్పుడు. ఎందుకంటే దీపావళి, పండుగ వచ్చిందంటే చాలు.. గుజరాత్.. సూరత్ లోని డైమండ్ మర్చంట్ సావ్ జీ ధోలాకియా సంస్థలో పని చేసే సిబ్బంది ఎగిరి గంతేస్తారు. ఈ పండుగకు బోనస్ గా ఈ వ్యాపారి... వారికి ఈసారి వెయ్యికి పైగా కొత్త కార్లు, 400 ప్లాట్లు కానుకగా అందజేయబోతున్నారు. హరేకృష్ణ ఎక్స్ పోర్ట్స్ ఓనర్ అయిన సావ్ జీ.. తమ సంస్థలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారికి ఈ నజరానాలు అందజేయనున్నారు. ఈ సంవత్సరం 1716 మంది ఉద్యోగులను బెస్ట్ ఎంప్లాయీస్ గా గుర్తించినట్టు ఆయన చెప్పారు.

ప్రతి సంవత్సరం ఇలా ఆయన దీపావళికి బోనస్ రూపంలో ఈ ఖరీదైన నజరానాలను అందజేస్తున్నారు. ఇప్పటికే కార్లు ఉండి.. సొంత అపార్ట్మెంట్లు లేనివారికి అపార్ట్మెంట్లను, ఫ్లాట్లు ఉండి కార్లు లేనివారికి కార్లను ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. 1100 చదరపు అడుగుల ఫ్లాట్ ఒక్కొక్కటి 15 లక్షలు ఖరీదు చేస్తుందని, అయిదేళ్ళ తరువాత ఉద్యోగులు నెలకు 11 వేలు చెల్లిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు. గత ఏడాది ఈ సంస్థ తమ సిబ్బందికి 491 కార్లను, 200 ఫ్లాట్లను అందజేసి, రికార్డు సృష్టించింది.

English summary

Surat diamond merchants businessman giving 1000 cars and 400 flats to employees for Diwali