చంద్రుని కలసిన సూరీడు

Sureedu Meets Chandrababu Naidu

03:21 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Sureedu Meets Chandrababu Naidu

ఇంతకీ చంద్రుడంటే , ఎపి సిఎమ్ చంద్రబాబు అని తెల్సు . మరి సూరీడు అంటే ఎవరో తెలుసా ... ఈ మధ్య కాలంలో వార్తల్లో కనిపించకుండా పోయిన ఈ సూరీడు ఎవరో కాదు ... దివంగత సిఎమ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తే సూరీడు... ఇంతకీ ఇతను విజయవాడలో గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబును కల్సుకున్నాడు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన సూరీడు పలు విషయాలపై చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మంత్రుల భూదందాపై సాక్షి పత్రికలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో సీఎం చంద్రబాబును సూరీడు కలవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ కుటుంబానికి సంబంధించి చాలా విషయాలు సూరీడుకు తెలుసు కనుక ఈ భేటీ వెనుక చాలా తతంగమే వుండి ఉంటుంది.

English summary

Andhra Pradesh Ex-Chief Minister Y.S.Raja Sekhar Reddy Associate Sureedu Meets With Andhra Pradesh Nara Chandra Babu Naidu in Vijayawada.