ఆస్తుల పంపకంపై షాకింగ్ కామెంట్స్ చేసిన దగ్గుపాటి బ్రదర్స్

Suresh Babu and Venkatesh talks about distribution of assets

01:17 PM ON 19th August, 2016 By Mirchi Vilas

Suresh Babu and Venkatesh talks about distribution of assets

టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేష్ ప్రొడక్షన్స్ ఒక ప్రత్యేకమైన బ్రాండ్. ఎంతో మందికి అన్నం పెట్టింది ఈ సంస్థ. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చింది ఈ సంస్థ. ఎన్నో సినిమాలను నిర్మించింది ఈ సంస్థ. ఇండస్ట్రీలో ఎక్కువ విజయాలు కూడా వీరే నిర్మించారు. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పైకి వచ్చారు. వీరికి లెక్కలేనంత ఆస్తులు ఉన్నాయి. వీటికి సురేష్ బాబు, వెంకటేష్ ఏ వారసులు. అయితే ఈరోజుల్లో ఆస్తులు ఉంటే చాలు సంతోషంగా ఉంటాం అని అనుకుంటుంటారు.. కానీ అది చాలా తప్పని ఆస్తులు ఉండడంతో పాటు మనసుల మధ్య చక్కటి అనుబంధంతో పాటు ఆప్యాయతలు కూడా తోడైతే వారి జీవితాలు ఆనందమయం.. దీనికి నిదర్శనమే దగ్గుపాటి బ్రదర్స్ సురేష్, వెంకటేష్.

ఒకే ఇంట్లో పెరిగిన అన్నదమ్ములు ఒక వయసు వచ్చాక కుటుంబాలు వేరవుతాయి. ఇంకాస్త వయసు పెరిగాక.. ఆస్తులూ వేరవుతాయి. ఏదో ఒక దశలో పంపకాలు తప్పవు. అయితే రామానాయుడి కుటుంబంలో మాత్రం ఇప్పటిదాకా ఆస్తుల పంపకాలే జరగలేదట. తమ తండ్రి ఆస్తి పంపకాల గురించి మాట్లాడినా తాము కొట్టిపడేసి అలాగే కంటిన్యూ అయిపోతున్నామని చెప్పాడు రామానాయుడు పెద్ద కొడుకు సురేష్ బాబు. తన తమ్ముడు వెంకటేష్ తో తనకు అంత చక్కటి అవగాహన ఉందని ఆయన చెప్పారు. వెంకటేష్, నేను కలిసికట్టుగా ఉంటాం. నా పెళ్లి అయినప్పుడే నాన్నగారు ఆస్తులు పంచుతానన్నారు. మేం వద్దు అన్నాం.

ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాం. మా మధ్య ఎలాంటి అరమరికలు ఉండవు. ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకుంటాం. ఒకరి మీద ఇంకొకరికి హక్కు ఉంది. ఒకరికి ఇష్టం లేని పని ఇంకొకరం చేయం. వాడికో ఇల్లుంది. అలాగే నాకో ఇల్లుంది. అంతే. మిగతాదంతా 'మాదే'. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి. వెంకీకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఇంత కాలం కష్టపడ్డామని.. ఇక టెన్షన్లు తగ్గించుకుని ఎంజాయ్ చేయమని నాకు సలహా ఇచ్చాడు అని సురేష్ చెప్పాడు. తనకు మలయాళ నటుడు మోహన్ లాల్ అంటే మాత్రం చాలా ఇష్టమని సురేష్ తన మనసులో మాట చెప్పాడు. అన్నదమ్ములు అందరూ ఇలానే ఉంటే ఎంతో బాగుంటుంది కదా..

English summary

Suresh Babu and Venkatesh talks about distribution of assets