రాజ్య‌స‌భ‌కు వెంకటేష్ సోదరుడు..!

Suresh Babu in race for Rajya Sabha

12:54 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Suresh Babu in race for Rajya Sabha

సినిమా వాళ్ళు రాజకీయాల్లో,రాజకీయ నేతలు సినిమా రంగంలో అడుగుపెట్టడం కొత్తేమీ కాదు. ఇప్పుడు సినీ రంగం నుంచి అందునా స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు. దివంగత నిర్మాత,మాజీ ఎంపి డాక్టర్ డి రామానాయుడు పెద్ద కొడుకు,విక్టరీ వెంకటేష్ సోదరుడు అయిన టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ పేరు టీడీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు వినిపిస్తోంది. జూన్‌లో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ నుంచి నాలుగు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. టీడీపీ నుంచి కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రితో పాటు ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహ‌న్‌రావు రేసులో ఉన్నారు. సుజ‌నా చౌద‌రి మంత్రిగా ఉన్నందున త‌న‌కు మ‌రోసారి అవ‌కాశం ఇవ్వాల‌ని చంద్ర‌బాబును మేనేజ్ చేస్తున్నారు. ఓ సీటు బిజెపి కి కేటాయించే సూచనలు వున్నాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: రోజులో పెరుగు ఎప్పుడు తింటే మంచిది?

పొతే మ‌రో సీటు కోసం టాలీవుడ్ అగ్ర నిర్మాత‌లు దగ్గుబాటి సురేష్, డాక్టర్ కేఎల్ నారాయణ పేర్లు టీడీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు వినిపిస్తున్నాయి. వీళ్ళ పేర్లను కూడా పార్టీ చురుగ్గా పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. దగ్గుబాటి సురేష్ కుటుంబానికి మొదటినుండి టీడీపీ తో సంబంధాలున్నాయి. మాజీ ఎంపీ, సినీ నిర్మాత, దివంగత దగ్గుబాటి రామానాయుడు బాపట్ల నుంచి టిడిపి తరపున లోక్ సభకు ఎన్నికై మంచి పేరే తెచ్చుకున్నారు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన రామానాయుడు టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌కు అత్యంత స‌న్నిహితులు.

ఇవి కూడా చదవండి: ప్రధాని హామీకి విలువ లేదా?

2004లో రామానాయుడు పురందేశ్వ‌రి చేతుల్లో ఓడిపోవ‌డంతో త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయాలకు దూరంగా ఉన్నారు. ప్ర‌స్తుతం సురేష్‌ రాజ్య‌స‌భ‌కు పంపితే సినిమా ఇండ‌స్ర్టీ నుంచి టీడీపీకి ఫుల్ స‌పోర్ట్ ఉంటుంద‌ని చంద్ర‌బాబు యోచిస్తున్న‌ట్టు టాక్ నడుస్తోంది. మ‌రో అగ్ర నిర్మాత డాక్ట‌ర్ కేఎల్‌.నారాయ‌ణ కూడా తనను రాజ్యసభకు పంపితే పార్టీకి అన్ని రకాలుగా సాయపడతానని టీడీపీ అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. మ‌రి చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి: బికినీ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి హాసన్!

English summary

Telugu Desham Party was planning to Send Producer D.Suresh Babu and KL Narayana to Rajya Sabha.