కేరళ కమల దళంలో సురేష్ గోపి !

Suresh Gopi To Join In BJP

05:28 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Suresh Gopi To Join In BJP

రాజకీయాల్లోకి మరో స్టార్ రాబోతున్నాడు. మలయాళంలో దాదాపు 200 చిత్రాలకు పైగా నటించిన సురేష్ గోపి రాజకీయ ఆరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. త్వరలో కేరళలో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో సురేష్ గోపిని రంగ ప్రవేశం చేయించాలని కమల నాధులు పావులు కడుపుతున్నారట. 1997లొ 'కలియట్టం' చిత్రానికి జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సురేష్ గోపి కి బిజెపి మంచి ఆఫర్ ఇస్తూ , ఆహ్వానం పలుకుతోందట.

సురేష్ గోపి పోలీస్ పాత్రలో ఒదిగిపోయి నటించిన 'పోలీస్ కమిషనర్' చిత్రం అనూహ్య విజయం సాధించడమే కాదు తెలుగు లో డబ్ అయి మంచి విజయం నమోదు చేసుకుంది. అలాగే మలయాళంలో జర్నలిజం మీద వచ్చిన సినిమా 'జర్నలిస్ట్ ' పేరిట తెలుగులో డబ్ అయింది. మంచి పర్సనాల్తీతొ ఇట్టే ఆకర్షించే ఈ మలయాళీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే, సంచలనమే. కేరళ లో ఓ అసెంబ్లీ స్థానం గానీ , ఓ పార్లమెంట్ సీటు గాని బిజెపిలో చేరడం ద్వారా కేరళలో ఆపార్టీకి ఖాతా ఓపెన్ చేస్తారనే ప్రచారం జోరుగానే జరుగుతోంది. సినీ రంగంలో మాదిరి రాజకీయాల్లో కూడా సురేష్ విజయాన్ని అందుకుంటారా మరి.

English summary

Malayalam Hero Suresh Gopi to join in Politics.A news came to know that he will join In BJP and to contest from BJP in upcoming elections.