ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రైనా

Suresh Raina attempted suicide

04:32 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Suresh Raina attempted suicide

టీమిండియా ఆటగాడు సురేష్‌ రైనా ఎలాంటి ఆటగాడో అందరికీ తెలిసిందే. మైదానంలో అడుగు పెట్టాడంటే అటు బ్యాటింగ్‌ తోనూ, ఇటు ఫీల్డింగ్‌ తోనూ ప్రత్యర్ధులని ముప్పతిప్పలు పెడతాడు. ఒక్కొక్కసారి మ్యాచ్‌ కష్టాల్లో ఉన్నప్పుడు బౌలింగ్‌, బ్యాటింగ్‌ కూడా చేసి ఒంటి చేత్తో మ్యాచ్‌ని కూడా గెలిపించిన రోజులున్నాయి. అలాంటి రైనా ఆత్మహత్యకి పాల్పడడం ఏంటి? అసలు రైనా ఎందుకీ ప్రయత్నం చేశాడు? టాప్‌ బ్యాట్‌మెన్స్‌లో ఒకరైన రైనా ఒక పెద్ద సెలబ్రిటీ, పైగా ఇటీవలే పెళ్ళి కూడా చేసుకున్నాడు. అలాంటి రైనాకి అంత కష్టమేమొచ్చింది అని మీరు అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.

సురేష్‌ రైనా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది ఇప్పుడు కాదు తను పడమూడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు. అవును రైనా 13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని ఇటీవలే 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' కి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో తెలియజేసాడు. రైనాకు చిన్నప్పటి నుండి క్రికెట్‌ అంటే మక్కువ ఉండడంతో ఓ స్పోర్ట్స్‌ హాస్టల్లో చేరాడు. అయితే ఒకసారి తాను ఆడిన మ్యాచ్‌లో విఫలమవ్వడంతో తోటి ఆటగాళ్లు తనని అవమాన పరిచారు. ఆ తరువాత ఒకసారి రైనా రైల్లో ప్రయాణిస్తుండగా, తోటి ఆటగాడు నిద్రిస్తున్న రైనా పై కూర్చుని తన ముఖం పై మూత్రం పోశాడు.

దీనితో ఉలిక్కిపడిన రైనా తన పై కూర్చున్న బాలుడ్ని వెంటనే పక్కకి తోసేశాడు. ఇంతటి అవమానం జరిగాక నేను హాస్టల్లో ఉండలేనంటూ రైనా ఇంటికి వచ్చేశాడు. అయినా ఆ అవమానం తరచూ గుర్తుకు రావడం, తన పై తనకి నమ్మకం కోల్పోవడంతో రైనాకి తరచూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చేదట. అయితే రైనా పరిస్థితి అర్ధం చేసుకున్న తన సోదరుడు రైనాకి ధైర్యం చెప్పి మళ్లీ హాస్టల్లో చేర్పించాడు. దీనితో ఈసారి రైనా తన టాలెంట్‌ ని నిరూపించుకున్నాడు. ఆ తరువాత టీమిండియాలో స్థానం సంపాదించుకున్నాడు.

English summary

Team India player Suresh Raina attempted suicide at 13 years age.