తండ్రి కాబోతున్న రైనా

Suresh Raina turning as a father

11:06 AM ON 10th May, 2016 By Mirchi Vilas

Suresh Raina turning as a father

టీమిండియా క్రికెటర్, ఆల్ రౌండర్ సురేశ్ రైనా తన అభిమానులకి ఒక శుభవార్త చెప్పాడు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు చెప్పి తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చాడు. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం గుజరాత్ లయన్స్ కెప్టెన్ రైనా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా రైనా మాట్లాడుతూ.. తన భార్య ప్రియాంకను కలిసేందుకు రైనా హాలండ్ బయలుదేరానని, రేపు ఆమెను కలువబోతున్నానని, తనకెంతో ఉద్వేగంగా ఉందని చెప్పాడు. అంతేకాకుండా కాబోయే తల్లిని చూసేందుకు ఆతృతగా ఉన్నానంటూ తన భార్యను ఉద్దేశించి ట్వీట్ చేసాడు రైనా.

English summary

Suresh Raina turning as a father. Team India Cricketer and All Rounder Suresh Raina is turning as a father very soon.