సచిన్ కు లండన్ లో సర్జరీ

Surgery for Sachin Tendulkar in London

12:02 PM ON 8th July, 2016 By Mirchi Vilas

Surgery for Sachin Tendulkar in London

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లండన్ లోని ఒక ఆసుపత్రిలో చేరారు. తన మోకాలుకు సంబంధించిన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు సచిన్ తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడిస్తూ, ఇందుకు సంబంధించిన ఫోటో షేర్ చేసుకున్నాడు. లండన్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ అనంతరం సచిన్ మోకాలికి వైద్యులు బ్యాండేజ్ వేశారు. గత కొద్దిరోజులుగా విదేశీ పర్యటనల్లో మాంచి ఊపుమీదున్న సచిన్ రిటైర్మెంట్ తర్వాత కూడా గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే అతి త్వరలో నేను కోలుకుని రోజువారి పనుల్లో నిమగ్నమవుతాననే నమ్మకం నాకుంది.

ప్రస్తుతం మోకాలికి ఆపరేషన్ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నాను అని అభిమానులతో తన అభిప్రాయం పంచుకున్నాడు. నవంబరు, 2013లో ఆటకు వీడ్కోలు పలికిన సచిన్ అప్పటి నుంచి కుటుంబ సభ్యులతోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రికెట్ గాడ్ కి ఆపరేషన్ అన్న విషయం తెలియగానే అభిమానులు షాక్ అయ్యారు. సచిన్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు సామాజిక మాధ్యమాలలో తమ కామెంట్లు పోస్ట్ చేశారు.

English summary

Surgery for Sachin Tendulkar in London