చిన్న టీజర్‌తో '24' సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది

Suriya 24 Movie 3 Second Teaser

04:41 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Suriya 24 Movie 3 Second Teaser

తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం '24. 'మనం' ఫేమ్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటించారు. సూర్య త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం టీజర్‌ని మొన్న విడుదల చెయ్యాల్సి ఉండగా కొన్ని అడ్డంకులు వల్ల అది విడుదల కాలేదు. అయితే దీపక్‌ భోజరాజ్‌ ఈ చిత్రానికి సంబందించిన 3 సెకెన్ల చిన్న టీజర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. అందులో సూర్య అదిరిపోయే గెటప్‌తో అదరగొడుతున్నాడు. అంతేకాదు త్వరలోనే ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయబోతున్నాం అని కూడా చెప్పారు. షూటింగ్‌ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది.

English summary

Hero Suriya was popular for his different movies.Recently he was acting in a different movie named "24" under the direction of Manam Fame Vikram.K Kumar.This film 3 second teaser was posted in Twitter by saying that Teaser was to release soon.