24లో నాలుగు పాత్రల్లో సూర్యనే..

Suriya 24 Movie Audio Launched

11:00 AM ON 12th April, 2016 By Mirchi Vilas

Suriya 24 Movie Audio Launched

కోలీవుడ్తో పాటు టాలీవుడ్ లోనూ అశేష అభిమానుల్ని సంపాదించుకున్న ఫిల్మ్ స్టార్ సూర్య మూడుపాత్రలు పోషిస్తోన్న '24' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరిగింది. టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో పూర్తి స్థాయి సైంటిఫిక్ ధ్రిల్లర్ గా రూపొందించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. ఆడియో వేడుక తమిళనాడులో సోమవారం ఉదయం జరగ్గా, సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు సూర్యతో పాటు, కార్తి, సమంత, నిత్యామీనన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్, పలువురు తెలుగు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: సర్దార్ మూడు రోజుల కలక్షన్స్

ఈ సందర్భంలో 24 మూవీ అఫీషియల్ ట్రైలర్స్ రిలీజ్ చేశారు. సూర్య సొంత బ్యానర్ లో 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పై కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ లను షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఒక వాచ్ మెకానిక్ (సూర్య) తనకు వీధిలో కనిపించిన అమ్మాయి (సమంత) కు లైన్ వేస్తుంటాడు. ఇంతలో ఒక పాత వాచ్ ను రిపేర్ చేస్తాడు. ఇక అదే వాచ్ కోసం ఒక ముసలాయన (సూర్య) చాలా సీరియస్ గా వెతుకుతుంటాడు. ఇక అదే వాచ్ కోసం ఒక కిల్లర్ (సూర్య) కూడా చూస్తుంటాడు. అసలు ఆ వాచ్ ను కనిపెట్టింది ఎవరంటే.. ఒక సైంటిస్టు (సూర్య) ఆయన భార్య (నిత్యా మీనన్)తో కలసి అది కనిపెట్టాడు. ట్రైలర్ చూస్తే అర్దమైన కథ అదే. అయ్యా.. ఇక '24' అంటే ఒకవేళ ఇరవై నాలుగు గంటలను ఉద్దేశించి ఆయన ఆ టైటిల్ పెట్టాడేమో కాని.. సినిమాలో ఉన్న పాత్రల్లో.. ఒక నాలుగు పాత్రలను మాత్రం సూర్య గారే వేసేశారయ్యా. మనోడికి ఇలాంటి అతి ఇప్పటివరకు కలసి రాలేదు. కాని స్టిల్ అదే కంటిన్యూ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

ఆ హీరోయిన్ కాళ్ళు నొక్కిన హీరో

ఎన్టీఆర్ కి తండ్రిగా సూపర్ స్టార్

'శృతి' మించి అందాలు ఆరబోసింది(వీడియో)

English summary