సూర్య 24లో కట్ అయిన 9 మినిట్స్ లో ఏముంది

Suriya 24 Movie Cuts By 9 Minutes

10:39 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Suriya 24 Movie Cuts By 9 Minutes

ఇటీవల రిలీజై పాజిటివ్ టాక్ తో నడుస్తోన్న హీరో సూర్య '24' సినిమా లో ఏకంగా 9నిమిషాల సీన్లు కట్ అయ్యాయట. తమిళ-తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరో సూర్య నటించిన ఈ సినిమా విక్రం కుమార్ డైరెక్షన్లో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించగా, టైం మిషన్ నేపథ్యంతో దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. మరింత రేసీ గా ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా నిడివి 9 నిమిషాలు తగ్గించినట్టు చెప్పుకుంటున్నారు. శనివారం మ్యాట్నీ నుంచి కొత్త వెర్షన్ ను థియేటర్లలో ప్రదర్శితమౌతోంది. మొదట ఈ మూవీ ఫుల్ లెంగ్త్ 2గంటల 40నిమిషాలు ఉండగా , లవ్ ట్రాక్, సెకండాఫ్ మరీ లెంగ్తీగా ఉందన్న వార్తల నేపథ్యంలో మూవీని కాస్త ట్రిమ్ చేయించినట్టు తెలుస్తోంది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తో్న్న ఈ సినిమా సూర్యకి మంచి లాభాలే తెచ్చిపెట్టేలా ఉంది. అటు ఈ సినిమా రీమేక్ రైట్స్ రూపంలో కూడా భారీ రేటు వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:కాజల్ బ్యాక్ అంటే మహేష్ సెంటిమెంట్

ఇవి కూడా చదవండి:మే 20నే 'బ్రహ్మోత్సవం' పండగ

English summary

Hero Suriya has got fame with the Different movies in South Industry. Recently he acted in 24 Movie under the direction of Vikram Kumar. 24 movie was going with good talk and this movie unit was going to cut 9 minutes movie.