సోషల్ మీడియాతో నిద్ర దూరమట..

Survey On Social Media

11:56 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Survey On Social Media

సోషల్ మీడియా.. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది జీవితాలు దీనితోనే ముడిపిపోయాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ చాలామందికి ఇదే లోకమైపోతోందట.అయితే తాజా అధ్యయనంలో వెల్లడైన విషయం ఏమిటంటే సోషల్‌ మీడియా చాలామందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సేపు గడిపేవారికి ప్రశాంతమైన నిద్ర కూడా కరువు అవుతోందట. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారం మొత్తం సామాజిక మాధ్యమాల్లో స్టేటస్‌ను తరచూ చెక్‌ చేసుకునే వారికి నిద్రాభంగం ముప్పు మూడు రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో ఎక్కువ సేపు గడిపేవారికి సాధరణ వ్యక్తుల కంటే రెండు రెట్లు నిద్రలేమి ఉంటుందని వెల్లడించారు. పొద్దుపోయే వరకు సామాజిక మాధ్యమాల్లో స్టేటస్‌లు మార్చడం, ఫొటోలు అప్‌లోడ్‌ చేయటం, వివాదాస్పద సంభాషణల్లో పాలుపంచుకోవడం వల్ల భావోద్వేగాలకులోనై విశ్రాంతి కరవు అవుతోందని తెలిపారు. మొబైల్‌, ట్యాబ్లెట్‌ నుంచి చిక్కటి కాంతి మీ జీవగడియారంలో మార్పులను తెచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ పరిస్థితి నుంచి బయటపడటం కోసం మళ్లీ నిద్ర వచ్చే వరకు ఏవో వెబ్‌సైట్లను వెతుకుతూ కాలం గడుపుతారని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది సంక్లిష్టమైన చక్రం వంటిదని, సోషల్‌ మీడియాను ఎక్కువగా చూడటం వల్ల నిద్రపట్టదని, నిద్రపట్టక పోవడం వల్ల సోషల్‌ మీడియాను ఎక్కువగా చూస్తుంటారని తెలిపారు. 19నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 1788 మందిని ప్రశ్నించి ఈ నివేదికను ఇచ్చారు. 2014లో 11 ప్రముఖ సామజిక మాధ్యమాలకు సంబంధించి వీరిని ప్రశ్నించారు. సర్వేలో పాల్గొన్న వారంతా నిత్యం దాదాపు 61 నిమిషాల పాటు వీటిని ఉపయోగిస్తున్నారని తేలింది. వారానికి దాదాపు 30సార్లు తమ సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో వారు 30 శాతం అధికంగా నిద్రలేమిని ఎదుర్కొన్నారు.

English summary

According to a survey states that due to social networking sites like Facebook,Twitter and many other social networking sites So many people were feeling Asleep. Levenson and her colleagues sampled 1,788 adults ages 19-32, using questionnaires to determine social media use and an established measurement system to assess sleep disturbances.