గ్రేటర్ లో సర్వేల గోల ....

Surveys On GHMC Elections

06:26 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Surveys On GHMC Elections

రేపో మాపో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి ) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపధ్యంలో పార్టీల్లో సందడి మొదలైంది. వార్డుల రిజర్వేషన్ గురించి ఆధికార టి ఆర్ ఎస్ , ఎం ఐ ఎం పార్టీలకు ముందే తెల్సని , విపక్షాలకు అభ్యర్ధులను ఎంపిక చేసుకోడానికి వీల్లేకుండా వార్డుల రిజర్వేషన్ ముందుగానే తమ కు అనుకూలంగా చేసుకున్నారని గ్రేటర్ హైదరాబద్ అఖిల పక్ష నేతలు ఎన్నికల అధికారి కార్యదర్శి ని కల్సి పిర్యాదు చేసారు.

ఇక సార్వత్రిక ఎన్నికల్లో సర్వేలు చేసేవారు గ్రేటర్ ఎన్నికల గెలుపు ఓటములపై కూడా సర్వేకు దిగుతున్నాయి. ఎవరి గోల వారిది అన్న చందంగా వ్యవహారం కనిపిస్తోంది. సర్వే పేరిట మైండ్ గేమ్ ఆడుతున్నారని , వాస్తవానికి భిన్నంగా సర్వేలు సాగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇది కూడా అధికార పార్టీ కుట్రగా విపక్షాలకు చెందిన కొందరు పేర్కొంటున్నారు. ఎవరికీ కావాల్సిన రీతిలో వారికి సర్వేలు వస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లో సర్వేలు తుస్సుమన్నాయని , ఏకబిగిన డబ్బా కొడితే , పనులు జరగవని పలువురు అంటున్నారు. అంతెందుకు ప్రధాని మోడీ గుజరాత్ సిఎమ్ గా వుండగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మీడియా అంతా మోడీ ఓటమి ఖాయమని కోడై కూసినా, సర్వేలన్నీ మోడీకి వ్యతిరేకంగా వచ్చినా సరే , వాటిని తలదన్నే విధంగా మోడీకి అనుకూలంగా ప్రజలు తీర్పు నిచ్చారని కొందరు గుర్తుచేస్తున్నారు.

ప్రజలను అయోమయంలో పడేయడానికే సర్వేలు అనే విధంగా వ్యవహారం నడుస్తోంది తప్ప, వాస్తవాలని ప్రతిబింబించడం లేదని చాలామంది అనే మాట. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల మాట ఎలా వున్నా ముందస్తు సర్వేల తతంగంతో ఏది నమ్మాలో ఏది కూడదో తెలీని పరిస్థితి నెలకొందని అంటున్నారు. సర్వేల్లో నిజం ఎంత అనేది ఎలా వున్నా ఓ ప్రహసనంగా మారాయి.

English summary

Different different Surveys has been started on Greater Hyderabad Municipal Corporation Elections on which who will win more seats in elections