సూర్య '24' సెన్షేషనల్‌ లుక్‌!!

Surya 24 movie sensational look

12:31 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Surya 24 movie sensational look

తమిళస్టార్‌ హీరో సూర్య తెలుగులో కూడా స్టార్‌ ఇమేజ్‌ ను సంపాదించుకున్నాడు. సూర్య వైవిధ్యంతో కూడిన కమర్షియల్‌ చిత్రాలను చెయ్యడానికి ఇష్ట పడతారు. 'మనం' డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్ కూడా అలాంటి సినిమాలనే చేస్తుంటాడు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే తాజా చిత్రం '24'. ఇంతకు ముందెప్పుడూ దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో రాని కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా ఘాటింగ్‌ ను పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఈ పోస్టర్‌ సినిమా పై భారీ అంచనాలు తెచ్చిపెట్టింది.

ఈ సినిమాలో సూర్య త్రిపాత్రాభినయంతో అలరించనున్నాడు. ఈ సినిమాలో సూర్య హీరో గానే కాకుండా విలన్‌ గా కూడా కనిపించనున్నాడు. ఈ సినిమా కి సంబంధించి మరో పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు నేషనల్‌ మీడియాలో సెన్షేషన్‌ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌ సమంత. ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా డబ్బింగ్‌ రైట్స్‌ని హీరో నితిన్‌ సొంతం చేసుకున్నాడు.

English summary

Surya latest movie 24 new look creates sensation in National Media. This movie is directed by Vikram K. Kumar. Samantha is acting as a heroine in this movie.