'24' టీజర్ లో ఐదు అవతారాల్లో అదరగొడుతున్న సూర్య

Surya 24 movie teaser

06:48 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Surya 24 movie teaser

తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న తాజా ప్రయోగాత్మక చిత్రం '24'. 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయంలో నటిస్తున్నారు, సైంటిఫిక్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వేసవి కానుకగా విడుదలవ్వనున్న ఈ చిత్రంలో సూర్య నే విలన్ కూడా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఇందులో సూర్య ఐదు పాత్రల్లో అలరిస్తున్నారు. ఒకసారి ఆ టీజర్ ని మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

Surya latest movie 24 movie teaser were released. This movie is directed by Vikram K. Kumar and Surya is acting in 3 roles in this movie.