గజని తరహాలో త్రివిక్రమ్-సూర్యల సినిమా!

Surya and Trivikram Srinivas movie

01:47 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Surya and Trivikram Srinivas movie

అప్పటి వరకు ఆ హీరో తమిళంలో మాత్రమే స్టార్ హీరో గజిని చిత్రం తరువాత ఆ హీరో తెలుగులో కూడా స్టార్ హీరో అయిపోయాడు. అతనే సూర్య. ఆ చిత్రమే సూర్యను అటు తమిళం, ఇటు తెలుగులో స్టార్ హీరోగా నిలబెట్టింది. ఇప్పుడు ఇలాంటి తరహాలోనే ఒక చిత్రం తెరకెక్కనుంది. ఆ వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజులు క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూర్యతో ఓ సినిమా తెరకెక్కించనున్నాడన్న వార్త అందరిలోనూ ఆసక్తి కలిగించింది. ఆసక్తితో పాటు ఈ కలయిక త్వరగా సెట్స్ మీదకు వెళ్లిపోవాలని కోరుకున్నారు కూడా కొందరు సినీ ప్రేమికులు. అయితే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు.

అనుకోకుండా ఆ సినిమా అటకెక్కింది. ఇలా ఆగిపోయిన ఈ సినిమాలో ఎప్పుడు రూపొందనుంది? అసలు త్రివిక్రమ్ సూర్యకు ఎలాంటి కథను చెప్పి ఒప్పించాడో? అనుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే ఈ కథలో సూర్య గుడ్డి వాడి పాత్రలో కనిపించాలట. సినిమా ప్రారంభమైన ఓ అరగంట సేపు సూర్య ఇలా అంధుడిగా కనిపించి అందరిలోనూ ఆసక్తి రేకిస్తాడట. ఈ పాత్రతో పాటు తను అనుకున్న పాయింట్ ను సూర్యకు చెప్పాడట మాటల మాంత్రికుడు. ఇక అందుకే ఈ సినిమాకు ఒకే చెప్పి త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సూర్య. ఇటీవలే ఈ కథ విషయం తెలియడంతో మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూర్యను ఇలా పడేశాడా? అనుకుంటున్నారు తెలుగు సినిమా ప్రేక్షకులు.

ఏదేమైనా కథతో పాటు సూర్య పాత్ర కూడా ఆసక్తిగా ఉండే ఈ కథ భవిష్యత్తులో అయినా సినిమాగా మారుతుందో? లేదో? చూడాలి. కాగా విలక్షణ నటనతో గజని సినిమాలో అలరించిన సూర్య.. మరోసారి త్రివిక్రమ్ తో గుడ్డి వాడి పాత్రలో నటించనుండడంతో సినిమా పై భారీ అంచనాలు మొదలయ్యాయి.

English summary

Surya and Trivikram Srinivas movie