త్రివిక్రమ్‌ సూర్య మధ్య 100 కోట్లు డీల్‌

Surya and Trivikram to do 100 Crore Project

06:58 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Surya and Trivikram to do 100 Crore Project

ఇటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 'అ....ఆ....' చిత్రం తోనూ, అటూ సూర్య 24 చిత్రంతోనూ చాలా బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు దాదాపు చివరి దశలో ఉన్నాయి. ఈ రెండు షూటింగ్స్‌ పూర్తి చేసుకున్న తరువాత త్రివిక్రమ్‌ సూర్య కలిసి చిత్రం తీయబోతున్నారట. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం 100 కోట్లు బడ్జెట్‌తో తీస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్‌, సూర్య వీరిరువురి కలయితతో ఒక చిత్రం రాబోతుందని గత సంవత్సరంలోనే వార్తలు వినిపించాయి. త్రివిక్రమ్‌ కూడా సూర్యతో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. కానీ ఎప్పుడూ సెట్స్‌పైకి వెళుతుంది అనే సంగతి మాత్రం త్రివిక్రమ్‌ చెప్పలేదు. ప్రస్తుతం వీరిరువురి ప్రాజెక్ట్‌లు చివరి దశకు చేరుకోవడంతో ఆ తరువాత ప్రాజెక్ట్‌కి సమయం పడుతుందని ఈలోగా ఓ సినిమా చేయాలనే థింకింగ్ లో మాటల మాంత్రికుడు, సూర్య ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

వీరి కాంబినేషన్‌లో రాబోయే చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. మరో వైపు వినిపిస్తున్నవార్త 'అ...ఆ..' చిత్రం షూటింగ్‌ ముగిసిన తరువాత అల్లు అర్జున్‌ తో త్రివిక్రమ్‌ సినిమా తీయబోతున్నాడనే వార్తలొస్తున్నాయి. మరి చివరికి ఏ హీరోతో సినిమా తీస్తారో కొంత కాలం వేచి చూడాల్సిందే.

English summary

Famous director trivikram srinivas is planning to do a 100cr budget movie with Surya.