సూర్య 25 లక్షల విరాళం!!

Surya Donated 25 lakhs to CM relief fund

07:47 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Surya Donated 25 lakhs to CM relief fund

తమిళస్టార్‌ హీరో సూర్యకి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉంది. ఈ హీరో తాజాగా నటించిన చిత్రం '24' సమ్మర్‌లో విడుదల కానుంది. సూర్య నట జీవితంలోనే కాదు నిజజీవితంలోనూ మంచి హీరో అని ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ చెన్నైలో ఒక ఫ్రీ స్కూల్‌ కూడా సూర్య ఆర్గనైజ్‌ చేస్తున్నాడు. అయితే వారం రోజులుగా చెన్నైలో విపరీతమైన వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వరదల ఉధృతికి ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ వరదల్లో నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం సహాయం అందిస్తుంది.

ప్రభుత్వంతో పాటు తన వంతు సాయంగా సూర్య రూ.25 లక్షల చెక్‌ను నడిగర్‌ సంఘం తరపున సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా అందజేశారు. వరద బాధితుల సహాయార్ధం సూర్య ఇలా తన వంతుగా ముందుకొచ్చి ఇంత ఎక్కువ మొత్తాన్ని అందజేయడం పట్ల సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

English summary

Surya Donated 25 lakhs to CM relief fund for chennai floods victims.