'24' లో హీరో-విలన్‌ రెండూ సూర్యనే !

Surya is Hero and Villan in 24 movie

05:59 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Surya is Hero and Villan in 24 movie

తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య, డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌ డైరెక్టర్‌ విక్రమ్‌.కె.కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం '24'. ఇప్పటి వరకూ సౌత్‌ ఇండియాలోని రాని కధతో, ఒక సైన్స్‌ ఫిక్షన్‌ కధాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని దర్శకుడు ముందు చెప్పారు. కానీ ఇప్పుడు సూర్య ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నారని అందరికీ షాక్‌ ఇచ్చారు. రెండు రోజుల క్రితం రిలీజైన '24' ఫస్ట్‌లుక్స్‌తో సినిమా పై భారీ అంఛనాలు పెరిగిపోయాయి.

అయితే దర్శకుడు మాట్లాడుతూ ఇందులో హీరో, విలన్‌ రెండూ సూర్యనే. మేము రిలీజ్‌ చేసిన రెండు ఫస్ట్‌లుక్స్‌లో విలన్‌కి సంబంధించిన లుక్‌ని రిలీజ్‌ చేయలేదు. ఆ మూడవ పాత్ర పేరు ఆత్రేయ అని చెప్పారు. అంతేకాకుండా ఈ చిత్రానికి '24' అనే టైటిల్‌ ఎందుకు పెట్టామో సినిమా చూసేటప్పుడు ఇంటర్వెల్‌ తర్వాత వచ్చే సన్నివేశాలతో రివీల్‌ అవుతుంది. ఈ చిత్రంలో సూర్య సరసన రెండోసారి సమంత నటిస్తోంది. ఈ సినిమాని సూర్య తన సొంత బ్యానర్‌ అయిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ని తెలుగు హీరో నితిన్‌ సొంతం చేసుకున్నాడు. తెలుగులో నితిన్‌ చేతుల మీదుగా ఈ చిత్రాన్ని విడుదల చేన్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ముందు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చెయ్యాలని ప్రీ ప్రొడక్షన్‌ పనులని కూడా శరవేగంగా పూర్తి చేశారు. అయితే సంక్రాంతికి రజనీకాంత్‌ కబాలి, విజయ్‌ 59వ చిత్రం రిలీజ్‌ అవుతుండటంతో వీళ్లకి పోటీగా ఎందుకని సూర్య సమ్మర్‌కి పోస్ట్‌పోన్‌ చేశారు. అంటే ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు.

English summary

Surya is Hero and Villan in 24 movie who is directing by Vikram K Kumar and samantha is acting once again with Surya