సూర్యతో కబాలి దర్శకుడు ‘5.35' ఆడుతున్నాడు

Surya Next Movie With Kabali Director

11:18 AM ON 28th July, 2016 By Mirchi Vilas

Surya Next Movie With Kabali Director

ఇక్కడి నెంబర్లు చూస్తుంటే, ఇదేదో ఆటలానే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే కబాలి సినిమాకు వచ్చిన టాక్ చూసాక , అందునా సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తూ వచ్చిన పోస్టులు చూసాక, సదరు దర్శకుని తో సినిమా అంటే ఆటగా అనుకోవడం సహజం. కానీ ఇది నిజం కాదు. వాస్తవానికి ఈ దర్శకునితో మూవీకి సూర్య రెడీ అన్నాడని తెలుస్తోంది. నిజానికి ‘కబాలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తమిళ యువ దర్శకుడు పా రంజిత్ గుర్తింపు పొందాడు. ఏకంగా సూపర్ స్టార్ రజనీతో ఓ రకమైన ప్రయోగం చేసి, సత్తా చాటుకున్నాడు. అందుకే తన తరువాతి సినిమాను సూర్యతో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కబాలి సినిమా అనుకున్నంతగా హిట్ సాధించకపోయినా ఈ యువదర్శకుడి టాప్ హీరోలు అవకాశాలిస్తున్నారు.తమిళ్ తో పాటు తెలుగులో కూడా రాణిస్తున్న సూర్య ఇటీవల ప్రయోగాలకు పెట్టింది పేరుగా మారాడు. అయితే, గత చిత్రాలన్నీ ఫ్లాప్ అయినా ఇటీవలి ‘24’ మాత్రం ఘన విజయం సాధించడంతో సూర్య మళ్లీ అదే బాటలో నడవాలని నిర్ణయించకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రంజిత్ వినిపించిన ‘5.35’ కథ నచ్చడంతో సూర్య ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కబాలి’ ఫలితంతో రంజిత్ తో సినిమా చేయాలా వద్దా అనే డైలమాలో సూర్య ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, రంజిత్ సూచించిన టైటిల్ ‘5.35’ను సూర్య ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం సూర్య, సింగం సీరీస్ లో భాగంగా సింగం 3 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తాజా కధనం.

ఇది కూడా చూడండి: ఈ ప్రదేశాలకు వెళ్తే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందట!

ఇది కూడా చూడండి: ఫోన్ లాక్ మర్చిపోయారా.! అయితే ఇలా ఓపెన్ చెయ్యండి

ఇది కూడా చూడండి: నగ్నంగా చెలరేగిన స్వాతీ నాయుడు

English summary

Surya Next Movie With Kabali Director pa Ranjith.