వాలెంటైన్స్‌ డేకి సూర్య ఇచ్చిన గిప్ట్‌ ఇదే

Surya released 24 movie another looks

03:46 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Surya released 24 movie another looks

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం '24'. 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల అవ్వనుంది. ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలయ్యి విపరీతమైన క్రేజ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాలెంటైన్స్‌డే సందర్భంగా ప్రేమకు సంబంధించిన రెండు ఫోటోలను విడుదల చేసారు. దీనితో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్‌ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన నిత్యమీనన్‌, సమంత హీరోయిన్లు గా నటించారు. వాలెంటైన్స్‌డే సందర్భంగా సూర్య తన అభిమానులకు ఈ రెండు లుక్స్ ను గిప్ట్‌గా రిలీజ్‌ చేసాడు.

English summary

Tamil Star hero Surya latest movie is 24. This movie is directed by Manam fame Vikram K. Kumar. Samantha and Nithya Menon is romancing with Surya in this movie.