మహేష్‌ కు విలన్‌ ఎవరు ?

Surya to Play villain at Mahesh movie

05:20 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Surya to Play villain at Mahesh movie

తాజా గా మహేష్ నటిస్తున్న చిత్రం గురించి చాలా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు విలన్‌ క్యారెక్టర్‌ గురించి చర్చలు సాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో మహేష్‌ హీరోగా నటించనున్నారు. ఇప్పుడు ఆ చిత్రంలో విలన్‌ క్యారెక్టర్‌ గురించి చర్చలు సాగుతున్నాయి. మహేష్‌ తో పని చేసిన దర్శకులలో ఒకరు విలన్‌గా ఎంపికయ్యాడని వార్త బయటకొచ్చింది. అంతే అప్పటినుండి ఎవరబ్బా ఆ రౌడీ అని ఆరాలు తీయడం మొదలెట్టారు.

కన్న తండ్రిని పొట్టన పెట్టుకున్న సన్నీ పోర్న్‌ మూవీలు

అందరూ టాలీవుడ్‌ దర్శకుల గురించి ఆలోచించి ఆలోచించి చివరికి తేజ-జయంత్‌ సి. పరాన్జీ అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేసారు. కానీ ఎస్‌. జె. సూర్య అని ఎవరూ ఆలోచించలేదు మహేష్‌ తో “నాని” సినిమాని తెరకెక్కించిన ఎస్‌.జె. సూర్య ఈ చిత్రంలో విలన్‌ అని తాజా సమాచారం.

అతని పర్మిషన్‌తోనే అన్నీ చేస్తున్న రెజీనా

ఎస్‌.జె.సూర్యకి తమిళంలో మంచి క్రేజ్‌. విలన్‌ పాత్రలో ఒదిగిపోతాడు అందుకనే అతడ్ని సెలక్ట్‌ చేసాడట మురుగదాస్‌. పైగా మహేష్‌ సినిమాని తమిళంలో, ఇంకా హిందీలో కూడా విడుదల చేయబోతున్నారట. అందుకే మూడు భాషల్లో పాపులర్‌ అయిన నటుల్ని ఎంపిక చేస్తున్నారని తెలుస్తుంది. ఎస్‌.జె. సూర్య అని తెలిసినప్పటి నుండి ఆయనైతే నమ్మొచ్చు అనుకుంటున్నారంట మహేష్‌ ప్యాన్స్‌. అన్నీ కుదిరితే ఈ నెలలో సినిమా మొదలు పెట్టాలనుకుంటున్నారు చిత్ర బృందం.

English summary

Coming to Mahesh Murugadoss film, it is expected to go on floors from June or July. In this film Surya to play Mahesh Babu's Villain. He mostly plays at least cameo roles in all his films and was seen essaying crucial roles in other directors films too.