బ్రేక్ కోసం పాట్లు ..

Sushanth New Movie Atadukundam Raa Movie To Release On 19th

10:52 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Sushanth New Movie Atadukundam Raa Movie To Release On 19th

టాలీవుడ్ లో వారసులు చాలామంది సక్సెస్ అయ్యారు. కొంతమంది డింకీ కొట్టారు. ఇంకొంతమంది మొదట్లో తడబడ్డా తర్వాత లైన్ లో పడ్డారు. ఇక ఎంత కష్టపడ్డా ఒక్క హిట్ కొట్టని హీరోల్లో సుశాంత్ ఒకడని చెప్పేయచ్చు. నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుశాంత్, ఇప్పటిదాకా మూడు సినిమాలు చేశాడు. ఆ మూడూ డిజాస్టర్ అవ్వడంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో సొంత బేనర్ దాటి బయటికి రాకుండా మరోసారి హిట్టు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఆటాడుకుందాం రా పేరుతో వస్తున్న ఈ మూవీ కోసం కామెడీ చిత్రాలతో వరుసగా హిట్లు కొడుతున్న నాగేశ్వరరెడ్డిని ఎంచుకున్న సుశాంత్ చాలా హోప్స్ పెట్టేసుకున్నాడు. వాస్తవానికి ఈ మూవీ చాన్నాళ్ల కిందటే సినిమా పూర్తయినా కొన్ని కారణాల వల్ల విడుదల కు దూరంగా ఉండిపోయింది. ఎట్టకేలకు ఈ నెల 19వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేయడానికి సుశాంత్ ఫిక్సయ్యాడు.

ఈ మూవీ హిట్ కొట్టడం కోసం సుశాంత్ ఏ ఒక్క అవకాశం జారవిడుచుకోవడం లేదు. అక్కినేని అభిమానుల్ని ఆకట్టుకోవడం కోసం ఈ సినిమాకు అనేక ఆకర్షణలు జోడిస్తున్నాడు. తాతగారి పాట పల్లెకు పోదాం.. ను రీమిక్స్ చేశాడు. పల్లెటూరిలోనే ఈ పాటను చిత్రీకరించి నాగేశ్వరరావును గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో సుశాంత్ నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా లుక్ ను కూడా ట్రై చేస్తున్నాడు. అచ్చంగా బంగార్రాజులాగా తయారై ఫొటో షూట్ కూడా చేశాడు. ఈ నెల 5న ఆటాడుకుందాం రా ఆడియో విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఫొటోలు కూడా రిలీజ్ చేశాడు. మొత్తానికి హిట్టు కోసం.. సినిమాకు ఆకర్షణ పెంచడం కోసం సుశాంత్ పడరాని పాట్లు పడుతున్నాడు. ప్రేక్షక దేవుళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి:వాటికైనా రెడీ అంటోన్న ఆంటీ..

ఇవి కూడా చదవండి:సినిమాల కోసం మొగుడ్ని వదిలేసింది

English summary

Young Hero Sushanth was acted in some movies and he got good response from the auidence and now he was coming to attract people with his new film "Atadukundam Raa". This movie was going to be released on 19th of this month.