గిన్నీస్ బుక్ లో సుశీల

Susheela Enters Into Guinness Book of World Records

09:51 AM ON 30th March, 2016 By Mirchi Vilas

Susheela Enters Into Guinness Book of World Records

ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయనిగా 1968లోనే రికార్డు సాధించిన సుశీల ఇప్పటి వరకు ఐదు జాతీయ పురస్కారాలను దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు గిన్నీస్ రికార్డు సొంతం చేసుకున్నారు. అత్యధిక పాటలు పాడిన గాయనిగా గానకోకిల పి.సుశీల గిన్నిస్‌ రికార్డులకెక్కారు. 1960 నుండి సేకరించి, నిర్ధారించిన మేరకు సోలో, డ్యూయట్‌, కోరస్‌ ఆధారిత పాటల విభాగంలో 6 భాషల్లో 17,695 పాటలు పాడినందుకు ఆమెకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ ధృవీకరణ పత్రాన్ని అందజేసింది.

ఇది కూడా చూడండి : జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది(ఫోటోలు)

గానకోకిల బిరుదును సార్ధకం చేసుకుని యావత్ భారతీయ సినీ సంగీత ప్రియులను తన స్వరమాధుర్యంతో ఓలలాడించిన పి.సుశీల కీర్తిసిగలో ఈ అరుదైన మైలురాయి చేరడం పట్ల సినీ సంగీత కళాకారులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1960లో ఆలిండియా రేడియోలో గాయనిగా కెరీర్‌ ప్రారంభించిన సుశీల ‘పెట్రతాయ్‌’ అనే తమిళ చిత్రంతో సినీ నేపథ్య గాయనిగా మారారు. ఆరు దశాబ్దాల ఆమె సినీ సంగీత ప్రస్థానంలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగా భాషల్లో రికార్డు సంఖ్యలో పాటలు పాడారు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి సుశీల 1,336 డ్యూయెట్లను పాడారు. అత్యధిక డ్యూయెట్లు పాడిన గాయనీగాయకులుగా కూడా బాలు, సుశీల రికార్డులకెక్కారు. 2008లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ బిరుదుతో సత్కరించింది. సుశీల అభిమాని, ప్రైవేటు సంగీత సంస్థ నిర్వాహకుడు అయిన శ్రీరామ్‌ తన అభిమాన గాయని పాటలను సేకరించి, గిన్నిస్‌ రికార్డు సాధనకు తోడ్పడ్డారు.

ఇవి కూడా చూడండి :

బ్రహ్మోత్సవం లో సీన్ లీక్! నిజంగా అద్భుతం

సంగీత్‌లో చిందేసిన మెగాస్టార్‌

సుప్రీంని ఆశ్రయించిన రోజా

English summary

Legendary Singer P.Susheela enters into Guinness Book Of World Records For Singing More than In the history.Upto now P.Susheela Sang more than 17,695 songs in six languages.