సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సునీల్ హీరోయిన్?!

Sushma Raj engagement was completed secretly

05:08 PM ON 29th July, 2016 By Mirchi Vilas

Sushma Raj engagement was completed secretly

నీలకంఠ తెరకెక్కించిన 'మాయ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సుష్మా రాజ్. ఆ తరువాత 'జోరు' చిత్రంలో సందీప్ కిషన్ తో కలిసి ఆడి పాడింది. ఆ తర్వాత తమిళంలో కూడా అదృష్టం పరీక్షించుకుంది. తాజాగా త్రిష 'నాయకి' చిత్రంలో కూడా మంచి పాత్రలోనే నటించిన ఈ హాట్ భామ.. సునీల్ హీరోగా తెరకెక్కుతున్న 'ఈడు గోల్డ్ ఎహే' చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకూండా ఓ తమిళ్ మూవీ కూడా చేతిలో ఉంది. అన్నీ కలిపి అరడజన్ సినిమాలు చేసిన సుష్మారాజ్ కి.. తన ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్ధం జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

మాములుగా పెళ్లైపోయినా హీరోయిన్లుగా కంటిన్యూ అయ్యే ట్రెండ్ బాలీవుడ్ లో ఉంది కానీ మన దగ్గర మాత్రం లేదు. అందుకే పెళ్లి-నిశ్చితార్ధం లాంటి వాటిని బయటకు రాకుండా చూసుకుంటారు. హీరోయిన్ సుష్మారాజ్ నిశ్చితార్ధం మే నెలలోనే అయిపోయినా.. ఈ విషయాన్ని కావాలనే సైలెంట్ గా ఉంచారట. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయి రిలీజ్ అయ్యాక మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఈ రూమర్లలో ఎంతవరకు నిజం ఉందో సుష్మారాజే స్వయంగా చెప్పాలి.

English summary

Sushma Raj engagement was completed secretly